Nandamuri Family: నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలతో ప్రత్యక్ష దైవంగా పూజించబడ్డారు. ఆయన్ని రోడ్డుకి ఈడ్చింది మాత్రం కుటుంబమే. కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ని ఏకాకిని చేసి… పదవి, సంపద లాక్కుని మానసిక క్షోభకు గురి చేశారు. 14 మంది సంతానం ఉన్న ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మి పార్వతి వద్ద దుర్భర పరిస్థితుల మధ్య కన్నుమూశారు. ఆయన పోయాక పదవుల కోసం, పార్టీ కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుని పబ్బం గడుపుతుంటారు.
Also Read: Revanth Reddy- Gangavva: గంగవ్వ ప్రేమకు ఫిదా అయిన రేవంత్‌రెడ్డి!
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా నందమూరి ఫ్యామిలీ అదే చేసింది. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి విజయాలతో ఎన్టీఆర్ టాప్ స్టార్ అయ్యారు. అది బాలకృష్ణ వర్గానికి నచ్చలేదు. వెంటనే తొక్కేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ని ఎదగకుండా చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఎన్టీఆర్ తల్లి మన కమ్యూనిటీ కాదంటూ నందమూరి అభిమాన వర్గాన్ని ఆయనకు దూరం చేయాలని చూశారు. ఎన్టీఆర్ సినిమాకు థియేటర్స్ ఇవ్వొద్దని బాలయ్య బెదిరించినట్లు ఓ వ్యక్తి నేరుగానే చెప్పాడు. ఇప్పుడు కూడా టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ ని రాకుండా చేస్తున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ కి తమ్ముడు త్రివిక్రమరావు అంటే ప్రాణం. ఎన్టీఆర్ హీరోగా ఎదిగాక త్రివిక్రమరావును పరిశ్రమకు తీసుకొచ్చి నిర్మాతను చేశాడు. త్రివిక్రమరావు నిర్మాణంలో ఎన్టీఆర్ పలు చిత్రాలు చేశాడు. తనకంటే చిన్నవాడు అయినప్పటికీ త్రివిక్రమరావు మాటను గౌరవించేవాడట ఎన్టీఆర్. అలాంటి త్రివిక్రమరావును ఎన్టీఆర్ కి దూరం చేశారు. మనస్పర్థలు సృష్టించారు. త్రివిక్రమరావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి హీరో కావాలనుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్ ఎలాంటి సప్పోర్ట్ ఇవ్వలేదు. అయితే ఓ మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ పరిశ్రమ నుండి సడన్ గా వెళ్లిపోయారు.
ఇక తారకరత్న మరణంతో కూడా కొన్ని లొసుగులు బయటకు వచ్చాయి. తారకరత్న తండ్రి కర్కశంగా వ్యవహరించారు. తారకరత్న మరణంతో కన్నీరు మున్నీరవుతున్న అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లలను ఆయన అక్కున చేర్చుకోలేదు. ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నేరానికి తారకరత్నను కూడా నందమూరి కుటుంబం ఇబ్బందులపాలు చేసింది. ఒక దశలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నానని, జూనియర్ ఎన్టీఆర్ కొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడని తారకరత్న స్వయంగా చెప్పారు. ప్రేమ వ్యవహారంలో హీరో వడ్డే నవీన్ ని కూడా తొక్కేశారనే వాదన ఉంది. ఇలా నందమూరి కుటుంబంలో చెప్పుకుంటూ పోతే చీకటి కోణాల ఎన్నో ఉన్నాయి.
Also Read:Women’s Day 2023: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.. ఈ సంవత్సరం ప్రాధాన్యతేంటి?