RRR Viral: ఆర్ఆర్ఆర్ థియేటర్ తెరల ముందు మేకులు, ఇనుప కంచెలు

RRR Viral: ‘తొక్కుకుంటూ పోవాలే’ అని ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే పిలుపునిచ్చాడో.. ఆయన పేరుతో ఫొటోలు రిలీజ్ అయ్యాయో.. అప్పుడే ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక మెగా ఫ్యాన్స్ సైతం రాంచరణ్ కోసం థియేటర్లలో తొలి రోజు హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే పీక్ స్టేజీకి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేనియా మొదలైంది. అభిమానులు థియేటర్లలో గోల చేయడం..రచ్చ చేయడం గ్యారెంటీ […]

Written By: NARESH, Updated On : March 24, 2022 4:48 pm
Follow us on

RRR Viral: ‘తొక్కుకుంటూ పోవాలే’ అని ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే పిలుపునిచ్చాడో.. ఆయన పేరుతో ఫొటోలు రిలీజ్ అయ్యాయో.. అప్పుడే ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక మెగా ఫ్యాన్స్ సైతం రాంచరణ్ కోసం థియేటర్లలో తొలి రోజు హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే పీక్ స్టేజీకి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేనియా మొదలైంది. అభిమానులు థియేటర్లలో గోల చేయడం..రచ్చ చేయడం గ్యారెంటీ కావడంతో అన్ని థియేటర్ల యజమానులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తెర పాడుకాకుండా.. ఇక స్టేజీ డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

RRR

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలను పురస్కరించుకొని థియేటర్లు అన్నీ సన్నద్ధమవుతున్నాయి. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగా థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా సినిమా హాళ్ల యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే సినిమా ప్రసారమయ్యే స్క్రీన్ ముందు అభిమానులు ఎగిరి గంతులేయడం సహజం.. కొన్ని సార్లు స్క్రీన్లు చింపేసి హంగామా సృష్టిస్తారు.

Also Read: Bollywood Media Spreading Negativity on RRR: ఆర్ఆర్ఆర్ ను తొక్కేయాలని చూస్తున్న బాలీవుడ్.. తెలుగు సినిమాపై ఎందుకింత కుట్ర

ఇద్దరు పెద్ద హీరోలు కాబట్టి సినిమాలో తమ హీరోకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని తెలిసినా థియేటర్ స్క్రీన్లు బద్దలు కావడం ఖాయం. అందుకే అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ముందు జాగ్రత్తగా స్క్రీన్ల ముందు రక్షణ చర్యలు చేపట్టారు. కొందరు స్క్రీన్ల ముందు మేకులు కొట్టించారు. కొందరేమో స్క్రీన్ పైకి ఎక్కకుండా ఏకంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఎవరైనా హద్దుదాటి ముందుకెళితే అభిమానులకు రక్తాలు కారడం ఖాయం. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికే ఇలా పెట్టామని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక సినిమా విడుదల వేళ తమకు పోలీస్ బందోబస్తు కావాలని పలువురు థియేటర్ల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారులను కోరుతున్నారు. మరోవైపు ఆయా హీరో అభిమాన సంఘాల ప్రతినిధులు థియేటర్లలో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా థియేటర్ యజమానులతో కలిసి రక్షణ చర్యలు చేపడుతున్నారు.

Also Read: RRR Movie First Full Review and Rating: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

Recommended Video: