
Israeli- Palestinian Conflict: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. దీనిని ఇజ్రాయెల్ నిజం చేసిం చూపింది. దక్షిణ ఆసియాలో చిన్న దేశం ఇజ్రాయెల్. దీనికి ఆ పాలస్తీనా కు అసలు పడదు.. యాసర్ అరాఫత్ అధ్యక్షుడుగా ఉన్న వరకూ ఇజ్రాయెల్ ఆటలు సాగ లేదు. పైగా అతడు ఇజ్రాయెల్ కాళ్ళల్లో కట్టెలు పెట్టేవాడు. అతడు గతించిన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఎటాక్ చేయడం షురూ చేసింది. కీలక ప్రాంతాలు స్వాధీనం చేసుకోవటం మొదలు పెట్టింది. కానీ ఇక్కడే పాలస్తీనా అసలు గేమ్ స్టార్ట్ చేసింది.
హమాస్ తీవ్రవాదులతో..
ఇజ్రాయెల్ నుంచి కాచుకునేందుకు పాలస్తీనా హమాస్ తీవ్ర వాదులతో జట్టు కట్టింది. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య నిత్యం రావణ కాష్టం. ఈ ఇద్దరి మధ్యలో అమెరికా జొర్రింది. ఇంకా పెంట పెంట చేసింది. మరో వైపు ఇజ్రాయెల్ శాస్త్ర సాంకేతిక రంగం వైపు దృష్టి సారించింది.. ప్రయోగాలకు పెద్దపీట వేసింది. వ్యవసాయంలో నూ సమూల మార్పులకు బీజం వేసింది.. సూక్ష్మ సేద్యాన్ని, బిందు సేద్యాన్ని అమలు లోకి తెచ్చింది. ఎందుకంటే ఇజ్రాయల్ దేశంలో వర్షపాతం చాలా తక్కువ.. అంతటి బీడు భూముల్లోనూ బంగారం పండిస్తోంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇజ్రాయిల్ దేశంలో అమలులో ఉన్న బిందు సేద్యాన్ని పరిశీలించి, రాష్ట్రంలోనూ అమలు చేశారు. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాను మించిపోయింది ఇజ్రాయిల్.. ఆ మధ్య మనదేశంలో వివాదానికి కారణమైన పెగాసాస్ లాంటి స్పై వేర్ ను కనిపెట్టింది కూడా ఇజ్రాయిల్ దేశమే. చూస్తే చిన్న దేశంగా కనిపిస్తుంది కానీ.. టెక్నాలజీ పరంగా తోపు.. ఇక ఇదే సమయంలో పాలస్తీనా కేవలం యుద్ధం మీద మాత్రమే దృష్టి సారించింది. అక్కడి తోనే ఆగిపోయింది..సొంత బలం లేకపోవడంతో హమాస్ తీవ్రవాదుల తో జట్టు కట్టింది. ఇజ్రాయెల్ ను కాచుకునేందుకు నానా తిప్పలు పడుతున్నది.

వేల మందిని హతం చేసింది
యుద్ధం అంటే గెలుపు, ఓటమి మాత్రమే. ఇందులో మానవత్వానికి చోటు ఉండదు. అసలు యుద్ధం అంటేనే గిట్టని వాడిని కొట్టడం. రాళ్లు రువ్వినా, రాకెట్ విసిరినా అందుకోసమే.. ఇక ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా విషయంలో అదే చేసింది. చేస్తోంది కూడా. ఇన్ని యుద్ధాలు చేసినా పాలస్తీనాకు సంబంధించిన గాజా నగరాన్ని ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకోలేకపోయింది.. ఈ క్రమంలో గత మంగళవారం గాజ నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. ప్రపంచం కూడా అలాగే అనుకుంది. ఇజ్రాయిల్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని పాలస్తిన అనుకుంది. బంకర్లలో వేలాది ఆయుధాలతో, హమాస్ తీవ్రవాదులతో కాపు కాసింది. కానీ ఇంతకీ ఇజ్రాయిల్ రంగంలోకి దిగలేదు. ఏదో ఉతిత్తి ప్రకటన చేసింది అని అనుకున్నారు. కే జి ఎఫ్ 2 లో అదిరపై కాల్పులు జరిపేందుకు రాఖీ కళాష్ నికాన్ ను ఉపయోగించినట్టు.. పాలస్తీనా బంకర్లలో తలదాచుకున్న హమాస్ తీవ్రవాదులపై
450 కి పైగా స్పైస్ _2000 లేజర్ గైడెడ్ బాంబులతో ఎఫ్ఏ18 యుద్ద విమానాలతో 150 టార్గెట్ల పై దాడులు చేసింది. ఈ ఆపరేషన్ ను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసింది. అప్పట్లో పాక్ లోని బాలా కోట్, బంకర్ బ్లాంక్డ్ బాంబులు వేసి ఎలా చిత్తు చిత్తు చేసిందో… అలాగే ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా కు బుద్ధి చెప్పింది.. త్వరలో గాజా నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది..