Karnataka: తనను ఇష్టలేని పెళ్లి చేసుకున్నాడని అంతకుముందు ప్రేమించిన యువతికి ఇచ్చి పెళ్లి చేసిన భార్యలను చూశాం. భార్య పెళ్లి ముందే మరొకరిని ప్రేమిస్తే.. పెళ్లి తర్వాత విషయం తెలుసుకుని ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసిన ఘటనలూ జరిగాయి. ఇక కొందరు పెళ్లికి ముందే ఇతర సంబంధాలు ఉన్నాయన్న కారణాలతో గొడవలు, విడాకుల ఘటనలు అయితే కోకొళ్లలు. అయితే ఇక్కడ ఓ భార్య మాత్రం తన భర్త ప్రియురాలికి భర్తలను అమ్మేసింది. అచ్చం శుభలగ్నం సినిమాలో కోటి రూపాయల కోసం ఆమని తన భర్త జగపతిబాబును మరో హీరోయిన్ రోజాకు అమ్మినట్లుగా తన భర్తను ఆయన ప్రియురాలికే రూ.5 లక్షలకే విక్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యకు సమీపంలోని గ్రామంలో జరిగింది. భార్య ఆఫర్ ఇద్దరి మధ్య కుదిరిన డీల్ చూసి స్థానికులు అవాక్కయ్యారు.
ఏం జరిగిందంటే..
సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఓ అసాధారణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తను అతడి ప్రియురాలికి రూ.5 లక్షలకు అమ్మేసింది. మాండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఇటీవల ఓ గృహిణి తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం గమనించింది. వారిదద్దరూ పడక గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల మధ్యా తలెత్తిన వివాదం పంచాయతీకి చేరింది.
రూ.5 లక్షలకు డీల్..
ఈ క్రమంలో పంచాయతీలో గృహిణికి, ఆమె భర్తను అప్పగించాలని ప్రియురాలు కోరింది. లేదంటే అతడు తీసుకున్న రూ.5 లక్షల అప్పును చెల్లించాలని డిమాండ్ చేసింది. బాగా అలోచించిన భార్య ఇలాంటి భర్త ఉన్నా ఒక్కటే.. లేకపోయినా ఒక్కటే అని భావించింది. తనకు మరో రూ.5 లక్షలు ఇస్తే తన భర్తను ఇచ్చేస్తానని ప్రతిపాదించింది. దీంతో ప్రియురాలుకు భార్య చెప్పిన డీల్ నచ్చింది. దీంతో సదరు ప్రియురాలు రూ.5 లక్షలు చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో భర్త బదిలీ పూర్తయింది. ఈమేరకు అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట. వారి మధ్య కుదిరిన ఒప్పందం చూసి గ్రామపెద్దలు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.