https://oktelugu.com/

Meditation : ధ్యానానికీ ఒక రోజు.. ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం !

ధ్యానం.. భారత దేశంలో పుట్టిన యోగాలో ఒక భాగం. ధాన్యంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అనేక రుగ్మతలు నయమవుతాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 9, 2024 / 06:12 AM IST

    World Meditation Day

    Follow us on

    Meditation  : ధ్యానం.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది. భారతీయ యోగాలో ధ్యానం ఒక భాగం. జ్ఞాపక శక్తిని పెంచడానికి ధ్యానం దోహదపడుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ధ్యానానికి ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఇక నుంచి ఏటా డిసెంబర్‌ 21న «ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. లీచెన్టయిన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్యదేశాలతో కూడిన జనరల్‌ అసెంబ్లీలో శుక్రవారం(డిసెంబర్‌ 6న) తీర్మానం ప్రవేశపెట్టాయి.

    ధ్యాన దినోత్సవం యొక్క ఉద్దేశం:

    1. శాంతి, సమతుల్యత: ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచి ఆంతరిక శాంతిని అందిస్తుంది. ఇది జీవితం ఒత్తిళ్లను తగ్గించి, శరీర, మనస్సు, ఆత్మలో సమతుల్యతను నెలకొల్పుతుంది.

    2. ఆరోగ్యం: నిరంతర ధ్యానం అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు హదయ సంబంధిత రుగ్మతలు తగ్గుతాయి.

    3. సామాజిక ఏకత: ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తులు ధ్యానంలో అనుభవిస్తున్న ప్రయోజనాలను పంచుకుంటూ ఒక సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తున్నారు.

    ముఖ్యమైన ప్రయోజనాలు:

    శారీరక ఆరోగ్యం: శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు పెరిగి, రక్త స్రావం మెరుగవుతుంది.

    మానసిక ఆరోగ్యం: ఆత్మవిశ్వాసం పెరిగి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

    శాంతి: ప్రపంచవ్యాప్తంగా ధ్యానాలు చేసే వారికీ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు సహాయపడతాయి.

    డిసెంబర్‌ 21న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రతి ఒక్కరూ ఒక్క చిన్న సమయం తీసుకొని ధ్యానం చేసి మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా చేసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రపంచ ధ్యాన దినోత్సవం మనకో శాంతి, ఆనందం, ఆరోగ్యం సాధించడానికి గొప్ప అవకాశం!