Father and Daughter: నువ్వే సర్వస్వం అన్నాడు. నీతోనే జీవితం అని బాస చేశాడు. రెండో పెళ్లయినా తోడుగా ఉంటానని చెప్పాడు. కొద్దిరోజులు బాగానే ఉన్నాడు. కానీ తరువాత అతడి బుద్ధి పక్కదారి పట్టింది. సాక్షాత్తు ఆమె కూతురుతోనే ప్రేమాయణం సాగించాడు. ఆమెను లోబరుచుకుని సరదాలు తీర్చుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నాకు నచ్చింది అని సమాధానం చెప్పాడు. తను నా కూతురు నీకు సబబు కాదని నచ్చజెప్పినా వినలేదు. కూతురుతోనే రంకు సాగించాడు. విషయం తెలిసి షాక్ కు గురయింది. ఎంత వారించినా పట్టించుకోలేదు. దీంతో తన కూతురుతోనే వెళ్లిపోయి తనలోని కర్కశత్వాన్ని బయటపెట్టాడు.

ఇండోర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిలో ఆశ్చర్యం నింపింది. కూతురు లాంటి దాన్ని తీసుకుని వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు దిక్కులేరని చేరదీస్తే తనకే అన్యాయం చేశాడని వాపోయింది. సంతోష్ సింగ్ అనే వ్యక్తిని ఇష్టపడి పెళ్లాడింది. రెండో పెళ్లి అయినా నీతోనే ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ చివరకు ఆమెకే శఠగోపం పెట్టాడు. నమ్మినందుకు మోసం చేసి ఆమె కూతురునే లోబరుచుకుని ఆమెతో వెళ్లడంతో ఖంగుతింది. జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: పీఆర్సీ చర్చలు జరగలే.. ప్రభుత్వం మంచి ఛాన్స్ మిస్ చేసుకుందా..?
ఆమె నీకు వరుస కాదు కూతురు లాంటిదని చెప్పినా వినలేదు. వావి వరసలు మరిచి కూతురులా చూసుకోవాల్సిన వాడే ప్రియుడి అవతారమెత్తాడు. ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదు. ఆమె కావాలని వెంట బెట్టుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వాడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఆమెను పెళ్లి చేసుకుని ఆమె కూతురుతోనే ప్రేమ వ్యవహారం నడపడంతో ఆశ్చర్యపోతున్నారు. జరగిన సంగతి గురించి కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఈవిషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కూతురు లాంటి దాన్ని తీసుకుని పారిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కంటికి రెప్పలా తండ్రిలా చూసుకోవాల్సిన ఆమెపైనే కన్ను వేసి శారీరకంగా లొంగదీసుకుని మాయమాటలు చెప్పి తీసుకోవడంతో ఆమె తల్లి నిర్ఘాంతపోతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కానీ ఇంతటి మోసానికి పాల్పడిన సంతోష్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది.
Also Read: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇంత అన్యాయమా.. పైసలు లేవు.. ప్రాజెక్టులు లేవు..!