RRR Janani Song: తెలుగువారే కాదు.. దేశం మొత్తం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ‘ఈ ప్రతిష్టాత్మక మూవీ సంక్రాంతికి వారం రోజుల ముందు విడుదలకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ఏకంగా అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటించిన ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీని కూడా ఫిబ్రవరికి వాయిదా వేసిన పరిస్థితి. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి.

సంక్రాంతి రేసులో టాలీవుడ్ మూవీలు కూడా ఇప్పటికే తప్పుకున్నాయి. ఒక్క ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ ‘భీమ్లా నాయక్’ మూవీలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి.
మరో నెలన్నర మాత్రమే సమయం ఉండడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రమోషన్ జోరు పెంచింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్ లకు పిచ్చ హైప్ వచ్చేసింది. ఇక ఇటీవలే విడుదలైన ‘నాటు నాటు’ సాంగ్ లో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు డ్యాన్సులతో ఉర్రూత లూగించారు. ఇప్పటికీ నాటు నాటు సాంగ్, స్టెప్పులు వాటికి అభిమానులు చేస్తున్న పేరడీ డ్యాన్సులతో ట్రెండింగ్ లో ఉంది.
ఆ ప్రమోషన్ ను మరింత పెంచేలా తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. ఈసారి నవంబర్ 26న అంటే మరో నాలుగు రోజుల్లోనే అభిమానులకు రాజమౌళి టీం గుడ్ న్యూస్ చెప్పబోతోంది.
ఆర్ఆర్ఆర్ నుంచి మరోసాంగ్ ‘జనని’ అనే పాటను నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘వందే మాతరం’ అని రాసి ఉన్న ఈ పాట లుక్ చూస్తే దేశ భక్తి ప్రధానంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పైన అజయ్ దేవగణ్, కింద రాంచరణ్, ఎన్టీఆర్ లు సీరియస్ లుక్ లో దీనంగా చూస్తున్న దాన్ని బట్టి ఇది స్వాతంత్య్ర సమరంలో వచ్చే సాంగ్ అని అర్థమవుతోంది. మరి ఈ పాట ఎలా ఉండబోతోంది? ఎలా అలరిస్తుంది? అని తెలియాలంటే నవంబర్ 26వరకూ ఆగాల్సిందే..