https://oktelugu.com/

Top 10 Movies Of 2022 India: సౌత్ ఇండియా చిత్రాల ప్రభంజనం…2022లో దేశం మెచ్చిన టాప్ 10 చిత్రాలు ఇవే!

Top 10 Movies Of 2022 India: 2022 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియనుంది. భారత చిత్ర పరిశ్రమ ప్రోగ్రెస్ కార్డు పరిశీలిస్తే సౌత్ కి మోదం నార్త్ కి ఖేదం. దక్షిణ భారత సినిమా రుచులు ఉత్తర భారత ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. సౌత్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. అదే సమయంలో నార్త్ చిత్రాలు కనీస ఆదరణకు నోచుకోలేదు. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్… ఒక్కరు […]

Written By:
  • Shiva
  • , Updated On : December 14, 2022 / 02:47 PM IST
    Follow us on

    Top 10 Movies Of 2022 India: 2022 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియనుంది. భారత చిత్ర పరిశ్రమ ప్రోగ్రెస్ కార్డు పరిశీలిస్తే సౌత్ కి మోదం నార్త్ కి ఖేదం. దక్షిణ భారత సినిమా రుచులు ఉత్తర భారత ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. సౌత్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. అదే సమయంలో నార్త్ చిత్రాలు కనీస ఆదరణకు నోచుకోలేదు. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్… ఒక్కరు కూడా విజయం సాధించలేదు.

    Top 10 Movies Of 2022 India

    బాలీవుడ్ కి చెందిన ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నినాదాన్ని దెబ్బతీసేది ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. పొలిటికల్ ప్రాపగాండాలో భాగంగా రూపొందిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నార్త్ ప్రేక్షకులు సమూలంగా హిందీ చిత్రాలను థియేటర్స్ లో రిజెక్ట్ చేశారు.

    దీనికి ఓటీటీనే కారణమని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది బాలీవుడ్. అయితే ముక్కూ ముఖం తెలియని సౌత్ హీరోల సినిమాలు అక్కడ విజయం సాధించి వారి అభిప్రాయం తప్పని రుజువు చేశాయి. ఓటీటీ ప్రభావం ఎంతో కొంత ఉన్నప్పటికీ కంటెంట్ తో తెరకెక్కిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది. కార్తికేయ 2, కాంతార చిత్రాల విజయం అందుకు నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ లో ఎక్కడలేని అయోమయం నెలకొంది. సౌత్ ముందు మోకరిల్లిన హిందీ పరిశ్రమను మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి ఎలా తేవాలనే ఆలోచనలో పడ్డారు.

    2022లో సౌత్ సినిమా ఎన్నడూ చూడని వైభవం చూసింది. దేశం మొత్తం తమవైపు తిరిగిచూసేలా చేసింది. ఈ ఏడాది సౌత్ చిత్రాలు ఎంతటి ప్రభంజనం సృష్టించాయో…ఫేమస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఇండియన్‌ మూవీస్‌ ఆఫ్‌ 2022’ లిస్ట్ చూస్తే అర్థం అవుతుంది. పది చిత్రాల్లో తొమ్మిది సౌత్ ఇండియా చిత్రాలే. ఒక్క కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి మాత్రమే ఈ లిస్ట్ లో చోటు దక్కింది.

    Top 10 Movies Of 2022 India

    ఈ ఏడాదికి గానూ ఆర్ ఆర్ ఆర్ అతిపెద్ద ఇండియన్ ఇండియన్ బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. అయితే ఆర్ ఆర్ ఆర్ రికార్డు కెజిఎఫ్ 2 బ్రేక్ చేస్తుందని ఊహించలేదు. బాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ కి రెట్టింపు వసూళ్లు కెజిఎఫ్ 2 కి దక్కాయి. సైలెంట్ గా వచ్చిన విక్రమ్, కాంతార చారిత్రాత్మక విజయాలు నమోదు చేశాయి. ఇక మణిరత్నం మానసపుత్రుడు, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ అంచనాలు అందుకుంది. ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లతో తమిళ సినిమా పరువు నిలిపింది. ఆర్ ఆర్ ఆర్ తో పాటు టాలీవుడ్ లో తెరకెక్కిన మేజర్, సీతారామమం చిత్రాలు మోస్ట్ పాపులర్‌ ఇండియన్‌ మూవీస్‌ ఆఫ్‌ 2022 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

    టాప్ టెన్ మోస్ట్ పాపులర్‌ ఇండియన్‌ మూవీస్‌ ఆఫ్‌ 2022 లిస్ట్… 

    1. ఆర్‌ఆర్‌ఆర్‌
    2. ది కశ్మీర్‌ ఫైల్స్‌
    3. కేజీయఫ్‌-2
    4. విక్రమ్‌
    5. కాంతార
    6. రాకెట్రీ
    7. మేజర్‌
    8. సీతారామం
    9. పొన్నియిన్‌ సెల్వన్‌
    10. 777 చార్లీ

    Tags