Waltair Veerayya Boss Party Song: చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కోరుకునే విధంగా ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సబ్జెక్టు అయినా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు..సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవల విడుదల చేసిన టైటిల్ టీజర్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజా రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇందులో రవితేజ చిరంజీవి కి తమ్ముడిగా కనిపించనున్నాడు..వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ అభిమానులకు కనులపండుగలాగా ఉండబోతుందట..ఇక ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఒక మాస్ సాంగ్ ని హైదరాబాద్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో తెరకెక్కించారు..’బాస్ పార్టీ’ అనే లిరిక్ తో ప్రారంభమయ్యే ఈ పాటకి సంబంధించిన ప్రోమోని ఈరోజు విడుదల చెయ్యగా దానికి ఫాన్స్ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ ‘బాస్ పార్టీ’ పూర్తి స్థాయి లిరికల్ వీడియో సాంగ్ ని ఈ నెల 23 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు..’నువ్వు లుంగీ ఎత్తుకో..హేయ్..నువ్ షర్ట్ ముడేసుకో..హేయ్..నువ్వు కర్చీఫ్ కట్టుకో..హేయ్..బాస్ వస్తుండు..బాస్ వస్తుండు’ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియా బాగా వైరల్ అయిపోయింది..ఈ సాంగ్ మీద అప్పుడే వందల కొద్దీ ‘మెమేలు’ కూడా వచ్చేసాయి..అయితే రొటీన్ సాంగ్ లాగ అనిపించడం తో సోషల్ మీడియా లో కాస్త నెగటివిటీ కూడా వచ్చింది..కానీ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కి ముందు నెగటివిటీ వచ్చినా ఆ తర్వాత సాంగ్ రీచ్ ఒక రేంజ్ లో ఉంటుంది..ఉదాహరణకి పుష్ప మూవీ సాంగ్స్ ని తీసుకోవచ్చు.

ప్రారంభం లో ఈ సినిమాలోని సాంగ్స్ కి మొదట్లో సోషల్ మీడియా లో నెగటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి..కానీ ఆ తర్వాత ఈ సాంగ్స్ నేషనల్ లెవెల్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మనకి తెలిసిందే..అలాగే ఈ ‘బాస్ పార్టీ’ అనే పాటకి కూడా అదిరిపొయ్యే రీచ్ వస్తుందని మెగాస్టార్ ఫాన్స్ చెప్తున్నారు..ఈ సాంగ్ లో చిరంజీవి మాస్ స్టెప్స్ కూడా అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఉంటుందట..చూడాలి మరి ఫాన్స్ అంచనాలను ఈ సాంగ్ రీచ్ చేస్తుందా లేదా అనేది.