Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ గత నెల రోజుల నుండి రామోజీ ఫిలిం సిటీ లో విరామం లేకుండా కొనసాగుతున్న సంగతి తెలిసిందే..సినిమాకి ఎంతో కీలకమైన ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశాన్ని భారీ తారాగణం తో షూట్ చేస్తున్నారు..పవన్ కళ్యాణ్ ని కలవడానికి తరుచూ ఎవరో ఒకరు షూటింగ్ స్పాట్ కి వస్తూ ఉంటారు కాబట్టి లొకేషన్ లోని ఫోటోలు సోషల్ మీడియా లో విడుదల అవుతూ ఉంటాయి.

అలా నిన్న పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన ఒక ఫోటో విడుదల అవ్వగా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఎరుపు రంగు కాస్ట్యూమ్స్ తో గెడ్డం లుక్ తో పవన్ కళ్యాణ్ కనిపించారు..నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ తోనే షూటింగ్ లో పాల్గొంటున్నాడు..అయితే ఇప్పుడు సినిమాకి కీలకమైన లుక్ కాస్ట్యూమ్స్ తో సహా లీక్ అయిపోవడం తో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగితే దిగండి కానీ, ఇలా సోషల్ మీడియా లో షేర్ చెయ్యొద్దు..ఫ్యాన్స్ లో ఉన్న కుతుహులం మొత్తం ఇలా లీకులు వల్ల పోతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కోరుకుంటున్నారు..పీరియాడిక్ జానర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని నిర్మాత AM రత్నం సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..కీరవాణి సంగీతం అందిస్తుండగా..నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఇందులో ఓరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు.

ఇక హాలీవుడ్ కి చెందిన టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు..కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు..టాలీవుడ్ కి ఈ చిత్రం ఒక బాహుబలి , #RRR లాగ మైలు రాయిగా నిలిచిపోతుందని మూవీ టీం గర్వంగా చెప్పుకుంటుంది..పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్దని కేంద్రీకరించాడు..సమ్మర్ కానుకగా మార్చి 28 వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారు.