Unstoppable With NBK Season 2: నందమూరి బాలకృష్ణ తనలోని ఎవరికీ పరిచయం లేని కొత్త యాంగిల్ ని అభిమానులకు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వ్యాఖ్యాతగా మారి ఆయన చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..బాలయ్య ని యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది ఈ సెన్సేషనల్ టాక్ షో..ఇప్పుడు టాక్ షో కి రెండవ సీజన్ కూడా ప్రారంభమై దిగ్విజయంగా నడుస్తుంది.

ఇప్పటికి నాలుగు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షోకి సంబంధించిన 5 వ ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది..నాల్గవ ఎపిసోడ్ కి ముఖ్య అతిధిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో స్పీకర్ సురేష్ రెడ్డి మరియు హీరోయిన్ రాధికా శరత్ కుమార్ హాజరయ్యారు..చాలా కాలం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కనిపించడం తో ఈ ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు త్వరలో ప్రసారం కాబొయ్యే 5 వ ఎపిసోడ్ కి ముఖ్య అతిధులుగా ఇద్దరు లెజండరీ డైరెక్టర్స్ మరియు ఇద్దరు లెజండరీ నిర్మాతలు హాజరు కాబోతున్నారు..వాళ్ళు మరెవరో కాదు అల్లు అరవింద్ , సురేష్ బాబు , రాఘవేంద్ర రావు మరియు కళాతపస్వి కె విశ్వనాధ్ గారు..అల్లు అరవింద్ ఈ అన్ స్టాపబుల్ షోకి నిర్మాత అనే విషయం తెలిసిందే..గత సీజన్ లో ఆయన కొడుకు అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా హాజరయ్యాడు కూడా..ఇప్పుడు అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు కూడా హాజరు అవ్వబోతుండడం విశేషం.

వీరితో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మరియు విశ్వనాధ్ గారు కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారు..రాఘవేంద్ర రావు చాలా ఇంటర్వూస్ ఇది వరుకు ఇచ్చిన విషయం తెలిసిందే..కానీ కె విశ్వనాధ్ ఇంటర్వూస్ కి దూరంగా ఉంటూ వస్తాడు..అలాంటి ఆయన ఇప్పుడు ఏకంగా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ రాబోతుండడం విశేషం..ఈ ఎపిసోడ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.