https://oktelugu.com/

Celina Jaitley : తండ్రి-కొడుకులతో రోమాన్స్ చేసిన హీరోయిన్.. బయటపెట్టిన క్రిటిక్

Celina Jaitley : సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లపై రూమర్లు కొత్తేమీ కాదు. కానీ అందరూ పట్టించుకోరు. కొందరు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతారు. ఇలాంటి విమర్శలు బాలీవుడ్లో హీరోయిన్లపై ఎక్కువగా వస్తుంటాయి. వాటిలో లైంగిక ఆరోపణలే ఎక్కువగా ఉంటాయి. లేటేస్టుగా సీనియర్ భామ సెలీనా జైట్లీపై దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల గురించి, సినిమా వాళ్లపై నిత్యం కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఉమైర్ ఇప్పుడు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2023 / 02:39 PM IST
    Follow us on

    Celina Jaitley : సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లపై రూమర్లు కొత్తేమీ కాదు. కానీ అందరూ పట్టించుకోరు. కొందరు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతారు. ఇలాంటి విమర్శలు బాలీవుడ్లో హీరోయిన్లపై ఎక్కువగా వస్తుంటాయి. వాటిలో లైంగిక ఆరోపణలే ఎక్కువగా ఉంటాయి. లేటేస్టుగా సీనియర్ భామ సెలీనా జైట్లీపై దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల గురించి, సినిమా వాళ్లపై నిత్యం కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఉమైర్ ఇప్పుడు సంచలన ఆరోపణలో చేసి ట్రెండింగ్ గా మారాడు. ఇంతకీ ఆయన హీరోయిన్ పై ఏం కామెంట్ చేశాడు? వాటికి సెలినీ జైట్లీ ఎలా రియాక్టయింది?

    సెలీనా జైట్లీ బాలీవుడ్లో కొన్ని సినిమాలే చేసింది. కానీ ఒకటి, రెండు సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2003లో జాన్సీన్ అనే సినిమా తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది. 2005లో తెలుగులో ‘సూర్యం’ సినిమాలో విష్ణు పక్కన నటించింది. ఈసినిమా ప్లాప్ కావడంతో మరోసారి టాలీవుడ్ వైపు చూడలేదు. కానీ సెలీనా హిందీలో కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే పెరిగాయి.

    అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపించే ఈమె ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు పోలేదు. ఈమెపై ఎవరూ కామెంట్స్ చేయలేదు. కానీ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఒకేసారి ఆశ్చర్యపోయే కామెంట్స్ చేశారు. ఆమె తండ్రి, కొడుకుల వద్ద పడుకుంది.. అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో నిజమెంతో? అబద్ధమెంతో? తెలియదు. కానీ ఆ వ్యాఖ్యల ఫలితం సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది.

    సంధు చేసిన కామెంట్లపై సెలీనా జైట్లి ఊరుకుంటుందా? ఒకవేళ పట్టించుకోకపోతే తప్పు ఒప్పుకున్నట్లువుతుందిగా? అందుకే సెలీనా ఫైర్ అయింది. ‘ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల నీకు ఆనందమవుతుంది కావొచ్చు.. మగాడివనే భావన కలుగుతుంది కావొచ్చు.. కానీ నువ్వు డాక్టర్ ను కలిస్తే బాగుంటుంది.. సంధు చెప్పినవన్నీ అబద్ధాలే’ అని విరుచుకుపడింది. అయితే విమర్శలు ఉంటాయి.. కానీ మరి ఇంతగా ఉంటాయా? అని నెటిజన్లు ఫైరల్ అవుతున్నారు.