Supreme Court- Central Govt: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థ పై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. అవి క్రమక్రమంగా ఇతర అంశాలకు విస్తరిస్తున్నాయి. అంతేకాదు రెండు వ్యవస్థల మధ్య ఆగాధాన్ని మరింత పెంచుతున్నాయి.. కేంద్రమంత్రి కిరణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నుంచి జనవరి ఒకటో తేదీ వరకు కేసుల విచారణలు ఉండవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్ ప్రకటించడం గమనార్హం. కోర్టుకు రెండు వారాలపాటు శీతాకాల సెలవులు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర మంత్రి ఏమన్నారంటే
కొలిజీయం వల్లే ఖాళీలు భర్తీ కావడంలేదని, న్యాయమూర్తుల నియామక విధానం మారనంతకాలం అత్యున్నత న్యాయ వ్యవస్థలో ఈ పరిస్థితి తప్పదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాదు సుప్రీంకోర్టు శీతాకాల సెలవుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల భారం అధికంగా ఉంటే బెయిల్ పిటిషన్లు, నిరర్థక వ్యాజ్యాలపై ఎందుకు విచారణ జరుపుతున్నదని ప్రశ్నించారు..
సుప్రీంకోర్టు జడ్జి స్పందించారు
కిరణ్ వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జి చంద్ర చూడ్ పరోక్షంగా స్పందించారు. వ్యక్తిగత స్వేచ్ఛ అమూల్యమైనదని, దానిని పరాధీనం చేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. తమ దృష్టిలో ఏ కేసు కూడా చిన్నది కాదని తేల్చి చెప్పారు.. వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు తన రాజ్యాంగ విధిని నిర్వర్తిస్తుందని స్పష్టం చేశారు. ” అంతరాత్మ చెప్పింది వినిపించుకోకపోతే… వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు… మేము రక్షించకపోతే.. ఇక్కడ ఉండి ఏం లాభం? మేము ఆ పని చేయకుంటే న్యాయానికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగంలోని 136వ అధికరణను మేము అతిక్రమించినట్లే.. ప్రజల ఇబ్బందులకు సంబంధించి చిన్న చిన్నవిగా కనిపించే కేసుల విచారణ జరుగుతున్నప్పుడే న్యాయ శాస్త్ర, రాజ్యాంగ అధ్యయన అంశాలు వెలుగులోకి వస్తాయి.. ఇది సుప్రీంకోర్టు చరిత్ర చెబుతోంది. పిటిషనర్ల బాధలను వినేందుకే సుప్రీంకోర్టు ఉంది.. వాటిపై అర్ధరాత్రి కూడా న్యాయమూర్తులు అధ్యయనం చేస్తారు.. కేసులు మరిన్ని రావాలని భావిస్తారు” అని చంద్రచూడ్ పేర్కొన్నారు..

ఎందుకు ఇలా
ప్రభుత్వ ప్రమేయం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులు నియమించుకునే కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని, దీనివల్ల న్యాయమూర్తుల భర్తీ ముందుకు సాగడం లేదని… దేశ వైవిధ్యానికి తగినట్లు ప్రాతినిధ్యం ఉండడం లేదని కేంద్రం కొంతకాలంగా విమర్శిస్తున్నది. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఇటీవల జడ్జిల నియామకాలను ఆమోదించకుండా కేంద్రమే అడ్డుకుంటున్నదని.. అసాధారణంగా జాప్యం చేస్తున్నదని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. అంతేకాదు కొలీజియం దేశ చట్టమని.. దీనిపై వ్యాఖ్యలు చేస్తే తేలిగ్గా తీసుకోమని స్పష్టం చేసింది.. కేంద్రమే కాదు కొలీజియం వివాదంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా జోక్యం చేసుకుంది.. దేశంలో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీ విధానాన్ని విమర్శిస్తూ సంఘ్ పత్రిక పాంచ జన్య రాబోయే సంచికలో ఏడు పేజీల కవర్ స్టోరీ ప్రచురించింది. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించడం తప్పు పట్టింది.. దీనికి న్యాయమూర్తి చేత, న్యాయమూర్తి ద్వారా, న్యాయమూర్తి కోసం అనే శీర్షిక పెట్టింది.. అంతేకాదు హైకోర్టుల్లో 50 శాతం మంది న్యాయమూర్తులు, సుప్రీంకోర్టులో 33 శాతం మంది జడ్జిలు పదవుల్లో ఉన్న న్యాయమూర్తులకు దగ్గరి, దూరపు బంధువులేనంటూ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకించింది.
B