Melinda Gates Foundation
Melinda Gates Foundation: మోకాలికి, బోడి గుండుకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఆకాశానికి, నెత్తి మీద ఉండే వెంట్రుకకు ఏమైనా అనుబంధం ఉంటుందా? మీ సమాధానం ఉండదు అనే కదా.. కానీ అమెరికాలో దోమలకు, వేల కోట్ల అధిపతి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కు కచ్చితంగా సంబంధం ఉంది. ఆ సంబంధమే ప్రతిష్టాత్మక అవార్డు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ స్టోరీ ఏమిటో మీరూ చదివేయండి.
వేల కోట్లకు అధిపతి అయిన బిల్ గేట్స్ స్వయంగా దోమలను నిర్మూలించే పని చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకుంది. వారిద్దరూ విడిపోయినప్పటికీ.. వారు దంపతులుగా ఉన్నప్పుడు నెలకొల్పిన మెలిండా గేట్స్ ఫౌండేషన్ ను మాత్రం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా దోమల వల్ల సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న బయోటిక్ కంపెనీ ఆక్సి టెక్ కు మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు అందజేస్తోంది. ఇలా నిధులు అందజేసినందుకు మెలిండా గేట్స్ ఫౌండేషన్ కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021 లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సి టెక్ జన్యుపరంగా అభివృద్ధి చేసిన 1,50,000 దోమలను విడుదల చేసింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్టుకు మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని అప్పట్లో ఆ కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తి చేసే ఈడిస్ దోమల ను జన్యుపరంగా సవరించేందుకు బహుళ సంవత్సరాల పరిశోధన ప్రాజెక్టును ఆక్సి టెక్ ప్రారంభించింది. అయితే దీని వెనుక బిల్ గేట్స్ ఉన్నారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.
ఈడిస్ దోమలను జన్యుపరంగా సవరించడం.. తర్వాత వాటిని అడవిలోకి విడుదల చేయడం ఇది మొదటిసారి కాదు. దశాబ్దాల క్రితం నుంచే పరిశోధకులు ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సి టెక్ కంపెనీ బ్రెజిల్ లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈడిస్ దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సి టెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చేందుకు పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవ సంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తోంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం 2018 జూన్ లో ఆక్సి టెక్ కంపెనీకి 5.8 మిలియన్ డాలర్లు కేటాయించింది. అమెరికా, కరేబియన్ దీవులలో మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమలను అరికట్టేందుకు ఈ నిధులను గేట్స్ ఫౌండేషన్ అందజేస్తున్నది. సెప్టెంబర్ 2020లో 1.4 మిలియన్ డాలర్ల రెండవ దఫా గ్రాంట్ ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం అందించింది. అమెరికాలో ఈ పనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని అక్సి టెక్ కంపెనీ ప్రతినిధి మీడియాకు వెల్లడించడం విశేషం. అయితే ఆ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020 యూఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేసేందుకు ఆక్సి టెక్ కు ఆమోదం తెలిపింది. అయితే దీనికి ముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాలలో ఉండే దోమలపై అధ్యయనం జరగాల్సి ఉంటుంది. ఇంతలోనే ఈ కంపెనీకి 30 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. ఇక జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతి మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి.
ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలపాటు నిద్రాణంగా ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు జీవం పోసుకుంటాయి. ఫ్లోరిడా కీస్ లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్ట్ దోమ వ్యాప్తి కేవలం నాలుగు శాతం మాత్రమే ఉంది. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్ట్ దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడదును మాత్రమే చికున్ గున్యా, జికా, డెంగ్యూ, వంటి వ్యాధులను వ్యాపింప చేస్తుంది. ఆడదోమలు మనుషులను కుట్టి, లాలాజలంతో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి పంపిస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సి టెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్ యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్ ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. అయితే ఇది మెలిండా గేట్స్ ఫౌండేషన్ సమకూర్చిన నిధులతో ఈ ప్రయోగాన్ని చేశారు. అందువల్లే ఆ ఫౌండేషన్ కు అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని ఆక్సి టెక్ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించకపోవడం విశేషం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The award was announced to the melinda gates foundation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com