https://oktelugu.com/

Shubaleka Sudhakar: తినడానికి తిండి లేక ఈ యాక్టర్ ఏం చేశాడంటే?

Shubaleka Sudhakar: శుభ లేఖ సుధాకర్.. నటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా బహుముఖ పాత్రలు పోషించి తెరపై అద్భుతమైన నటనను ప్రదర్శించే గొప్ప నటుడు. నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో కష్టపడి స్థిరపడ్డ వ్యక్తిగా సుధాకర్ పేరు పొందాడు. ఏ చిన్న పాత్ర వచ్చినా కదనకుండా చేస్తాడని.. ఆఖరుకు సీరియల్స్ లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2022 / 10:29 PM IST
    Follow us on

    Shubaleka Sudhakar: శుభ లేఖ సుధాకర్.. నటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా బహుముఖ పాత్రలు పోషించి తెరపై అద్భుతమైన నటనను ప్రదర్శించే గొప్ప నటుడు. నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో కష్టపడి స్థిరపడ్డ వ్యక్తిగా సుధాకర్ పేరు పొందాడు.

    ఏ చిన్న పాత్ర వచ్చినా కదనకుండా చేస్తాడని.. ఆఖరుకు సీరియల్స్ లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ తన కష్టాల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

    నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే శుభలేక సుధాకర్ కు పెద్దలు కుదిర్చిన ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ చెల్లెలుతో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి కాగానే ఆరు నెలల వరకూ సినిమా అవకాశాలు లేక శుభలేక సుధాకర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.. కొంతకాలంపాటు తినడానికి తిండి లేకుండా గడపాల్సి వచ్చిందట..

    అయినా కూడా అప్పటికే ప్రముఖ గాయకుడు అయిన ఎస్పీ బాలును శుభలేఖ సుధాకర్ దంపతులు సాయం కోరలేదట.. కోరితే చేసేవాడే కానీ.. తమకే మొహం చెల్లక వెళ్లి అడగలేదని సుధాకర్ తెలిపారు. తర్వాత సినీ అవకాశాలు వచ్చి స్థిరపడ్డామని.. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నామని తెలిపారు.

    ఆకష్టాలు తెలుసు కాబట్టే సినిమా అయినా.. సీరియల్ అయినా తనకు అవకాశం వస్తే తప్పుకుండా చేస్తానంటూ సుధాకర్ పాత కష్టాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. కెరీర్ తొలి దశలో తాను ఎన్నో కష్టాలు అనుభవించానని.. తన భార్య శైలజ తనకు కష్టాల్లో తోడుగా నిలిచిందని సుధాకర్ ఎమోషనల్ అయ్యాడు.