spot_img
Homeఎంటర్టైన్మెంట్Dil Raju Varasudu Movie: చెరపకురా చెడేవూ... దిల్ రాజు ఫెయిల్ అయినట్లేనా?

Dil Raju Varasudu Movie: చెరపకురా చెడేవూ… దిల్ రాజు ఫెయిల్ అయినట్లేనా?

Dil Raju Varasudu Movie: చెడపకురా చెడేవు అన్న సామెత ఉండనే ఉంది. ఎవరినో ఏదో చేద్దాం అనుకుని చివరికి దిల్ రాజే బుక్ అయ్యాడు. నేడు విడుదలవుతున్న వారసుడు చిత్రంపై కనీస బజ్ లేదు. తెలుగు ఆడియన్స్ వారసుడు చిత్రం చూడాలన్న ఆసక్తి చూపించడం లేదు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఆ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకే మొగ్గు చూపిస్తున్నారు. ప్రతి విషయంలో చాలా పక్కాగా ఉండే దిల్ రాజు వారసుడు విషయంలో తడబడ్డాడని స్పష్టంగా అర్థం అవుతుంది. ఆయన పొరపాట్లతో వారసుడు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దెబ్బ పడింది అంటున్నారు.

Dil Raju Varasudu Movie
Dil Raju Varasudu Movie

ముఖ్యంగా ప్రమోషన్స్ సరిగా లేవు. వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న విజయ్ వారసుడు చిత్రం కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టలేదు. ఇది దారుణ పరిణామం. చేసేది లేక దిల్ రాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో హీరో, హీరోయిన్ లేకపోతే ప్రచారం ఎక్కడి నుండి వస్తుంది. వారసుడు చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేయడం విజయ్ కి కూడా అవసరం. పాన్ ఇండియా హ్యాంగ్ ఓవర్ లో ఉన్న హీరోలు ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ విస్తరించుకోవాలి అనుకుంటున్నారు.

దేశంలోనే అతిపెద్ద సినిమా పరిశ్రమగా అవతరించిన టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం విజయ్ కే నష్టం. ఇక వారసుడు మూవీపై జనాల్లో ఆసక్తి పోవడానికి మరొక కారణం విడుదల తేదీ. కొత్త సినిమా ఫీలింగ్ తెలుగు ఆడియన్స్ లో పోయింది. కారణం… జనవరి 11న తమిళ వర్షన్ వారిసు విడుదలైంది. సినిమా కథ, కథనం, టాక్ బయటకొచ్చేశాయి. పైరసీ బొమ్మలు కూడా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. దానికి తోడు సినిమాకు యావరేజ్ టాక్.

Dil Raju Varasudu Movie
Dil Raju Varasudu Movie

తమిళ వర్షన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఉంటే వారసుడు చిత్రానికి ప్లస్ అయ్యేది. సినిమా బాగుందంట చూడాలని ఆడియన్స్ ఆసక్తి కనబరిచేవారు. వారిసు సోసోగా ఉందని తెలియగానే వారసుడు చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. దిల్ రాజు ముందుగా అనుకున్నట్లు జనవరి 11న వారసుడు కూడా విడుదల చేస్తే హైప్ వేరుగా ఉండేది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కేవి. ట్రైలర్ తోనే నెగిటివిటీ మూటగట్టున వారసుడు చిత్రాన్ని లేటుగా విడుదల చేసి దిల్ రాజు నష్టపోయాడు. థియేటర్స్ లాక్ చేసిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను ఇబ్బంది పెట్టాలని దిల్ రాజు చూశాడు. కానీ వారసుడు చిత్రాన్ని ఆయన జనవరి 14కి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయనే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version