spot_img
Homeఎంటర్టైన్మెంట్NTR -Team India Cricketers: యంగ్ టైగర్ తో యంగ్ క్రికెటర్స్... తారక్ ని కలిసిన...

NTR -Team India Cricketers: యంగ్ టైగర్ తో యంగ్ క్రికెటర్స్… తారక్ ని కలిసిన టీం ఇండియా, ఫోటోలు వైరల్!

NTR -Team India Cricketers: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని టీమ్ ఇండియా క్రికెటర్స్ కలిశారు. ఆయనతో ఫోటోకి ఫోజిచ్చారు. న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన క్రికెటర్స్ ఎన్టీఆర్ తో ముచ్చటించారు.కాగా ఎన్టీఆర్ ఇండియాకు వచ్చి కొద్దిరోజులే అవుతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అమెరికా వెళ్లారు. అనంతరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. రాజమౌళి, రామ్ చరణ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి సతీసమేతంగా హాజరయ్యారు. దీంతో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతిని వెంట తీసుకెళ్లారు. ఆమె సైతం ఈవెంట్లో పాల్గొన్నారు.ఇక ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

NTR -Team India Cricketers
NTR -Team India Cricketers

నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. గోల్డ్ గ్లోబ్ ఈవెంట్ ఘనంగా ముగించుకొని ఎన్టీఆర్ ఇండియాకు వచ్చారు. దీంతో ఇండియన్ క్రికెటర్స్ కి ఆయన్ని కలిసే అవకాశం దక్కింది. యంగ్ క్రికెటర్స్ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, చాహల్, శార్దూల్ ఠాకూర్ తో పాటు మరికొందరు ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యులు ఎన్టీఆర్ తో ముచ్చటించారు.

న్యూజిలాండ్ టీమ్ ఇండియా టూర్ లో భాగంగా ఆరు వన్డే మ్యాచ్లు ఆడనుంది. మొదటి మ్యాచ్ కి హైదరాబాద్ వేదికైంది. జనవరి 18న మ్యాచ్ జరగనుండగా టీం ఇండియా సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. సందర్భం కుదరడంతో ఎన్టీఆర్ ని వారు కలిశారు. ఫోటోలు దిగి ముచ్చటించారు. యంగ్ క్రికెటర్స్ తో ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సదరు ఫోటోలు చూసి… మా అన్న క్రేజ్ అంటే అది మరీ… అని కామెంట్స్ చేస్తున్నారు.

NTR -Team India Cricketers
NTR -Team India Cricketers

మరోవైపు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూట్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ 30 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే మూవీ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version