https://oktelugu.com/

Supreetha : తీరని ఆ కోరికలు తలుచుకుంటూ సురేఖ కూతురు ఇలా అయ్యింది!

Supreetha :  కేవలం సోషల్ మీడియా సెలబ్రెటీగా పిచ్చ పాపులర్ అయ్యింది సుప్రీత. నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెను ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలో అవుతున్నారు. తరచుగా సుప్రీత షేర్ చేసే వీడియోలు, ఫోటోలపై తమ అభిప్రాయం తెలియజేస్తూ ఉంటారు. చెప్పాలంటే సురేఖా వాణి ఒక ప్రణాళిక ప్రకారం కూతురిని ఫేమస్ చేసింది. తనకున్న పాపులారిటీతో అమ్మాయిని సోషల్ మీడియా సెలెబ్రిటీని చేసింది. సుప్రీతను హీరోయిన్ చేయాలనే […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2023 / 09:42 AM IST
    Follow us on

    Supreetha :  కేవలం సోషల్ మీడియా సెలబ్రెటీగా పిచ్చ పాపులర్ అయ్యింది సుప్రీత. నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెను ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలో అవుతున్నారు. తరచుగా సుప్రీత షేర్ చేసే వీడియోలు, ఫోటోలపై తమ అభిప్రాయం తెలియజేస్తూ ఉంటారు. చెప్పాలంటే సురేఖా వాణి ఒక ప్రణాళిక ప్రకారం కూతురిని ఫేమస్ చేసింది. తనకున్న పాపులారిటీతో అమ్మాయిని సోషల్ మీడియా సెలెబ్రిటీని చేసింది. సుప్రీతను హీరోయిన్ చేయాలనే ప్రణాళికలో భాగంగా ఇది జరిగింది.

    ఓ రెండున్నరేళ్లుగా సురేఖా వాణి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. హాట్ వీడియోలు చేస్తూ మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో సురేఖా వాణి షేర్ చేసే ప్రతి వీడియోలో దాదాపు కూతురు సుప్రీత ఉంటుంది. చెప్పాలంటే వీరు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. విందులు, విహారాలు కలిసి చేస్తారు. ఆ మధ్య బర్త్ డే పార్టీలో కూతురికి సురేఖా వాణి స్వయంగా మందు తాగించడం సంచలనమైంది. దీనికి సంబంధించిన ఫోటో బయటకు రాగా… నెటిజెన్స్ ఆమెపై మండిపడ్డారు.

    2019లో సురేఖా వాణి భర్త అనారోగ్యంతో మరణించారు. ఆ సమయంలో ఆమె సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. అదే సమయంలో సురేఖా వాణికి సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ తగ్గాయి. దీంతో సురేఖా వాణి జనాలు మర్చిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నారు. సాధారణ ఫోటోలు వీడియోలు పెడితే జనాలు పెద్దగా పట్టించుకోరు కాబట్టి… కొంచెం హాట్నెస్ ఉండేలా చూసుకుంటుంది. మరి కూతురిని హీరోయిన్ చేయాలన్న సురేఖా వాణి కల ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.

    మరోవైపు సుప్రీత ప్రేమలో పడ్డారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ యూట్యూబర్ తో సన్నిహితంగా ఉంటున్న తరుణంలో అతన్ని ప్రేమిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సుప్రీత స్పందించలేదు. ఇక ఆమెలో హీరోయిన్ కావాలనే కోరిక బలంగా ఉంది. అది నెరవేర్చుకోవడం కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలో కొంచెం మానసిక ఒత్తిడికి కూడా గురవుతుంది. హీరోయిన్ గా ఎదగడం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను టాలీవుడ్ మేకర్స్ పట్టించుకోరు. హీరోయిన్ కావాలన్న కోరిక తలచుకుంటూ సుప్రీత సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారని అంటున్నారు. ఆమె లేటెస్ట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.