Dhee 15- Sudigali Sudheer: ఈటీవీ లో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ డ్యాంసింగ్ షో విజయవంతంగా 14 సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే..ఇది కేవలం తెలుగు లో మాత్రమే కాదు..సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ డాన్స్ షో..ప్రతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిముషాలు అయితే చాలు..ప్రేక్షకులందరూ టీవీ లకు అతుక్కుపొయ్యి చూస్తుంటారు..అనితర సాధ్యమైన డాన్స్ మూవ్మెంట్స్ తో చూసే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపొయ్యేలా ఈ డాన్స్ షో కి రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవి.

ఇటీవలే సీజన్ 14 ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో గ్రాండ్ ఫినాలే కి మాస్ మహామరాజ రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ గా జతిన్ నిలిచాడు..ఇక అతి త్వరలోనే 15 సీజన్ ఘనంగా ప్రారంభం కాబోతుంది..ఈ సీజన్ కొత్తవాళ్ళ కోసం చేస్తున్నారట..అందుకోసం 5 నుండి 35 సంవత్సరాలు నిండున్న వాళ్ళు ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు..అతి త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కానుంది.
ఇక సీజన్ లో టీం లీడర్ గా సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది..సుడిగాలి సుధీర్ గతం లో నాలుగు సీజన్స్ కి టీం లీడర్ గా వ్యవహరించాడు..డాన్స్ మధ్య లో ఆయన చేసే చిన్న చిన్న కామెడీ స్కిట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండేది..కానీ గత రెండు సీజన్స్ నుండి ఆయన కనిపించడం లేదు..సుధీర్ ని బాగా మిస్ అవుతున్నాం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు రావడం తో అభిమానులు ఖుషి అవుతున్నారు..ఆయనతో పాటు హైపర్ ఆది ,రష్మీ కూడా ఈ షో లో ఉంటారు..గత సీజన్స్ లో వీళ్ళ ముగ్గురు కలిసి యాంకర్ ప్రదీప్ తో చేసే కామెడీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేడో మన అందరికి తెలిసిందే..ఈసారి కూడా ఈ కాంబినేషన్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.