SriMukhi Video: సోషల్ మీడియా వచ్చాక.. అందులో రీల్స్ అనేవి అందరూ చేస్తున్నారు. తమ మూడ్ కు తగ్గ థీమ్ ను తీసుకొని అందులో తెగ నటించేస్తున్నారు. చాలా మంది పాటలు, కామెడీలపై పేరడి చేస్తారు. కొందరు ప్రేమను పంచే వీడియోలు చేస్తారు. సెలబ్రెటీలంతా ఇప్పుడు ఈ ఇన్ స్టాగ్రామ్ మాయలో పడిపోయారు.

తాజాగా శ్రీముఖి సైతం ఒక ప్రియురాలు తన ప్రియుడి కోసం ఎంత తపన పడిందో తెలిపే వాయిస్ ను ఇమిటేట్ చేసింది. ఆ వీడియోలో జీవించేసింది. ‘బంగారం ఛీ పోరా’ అంటూ విరహ వేదనను కళ్లకు కట్టింది.
ఈ వీడియో చూశాక బాగా నటించావని శ్రీముఖని కొందరు కామెంట్ చేశారు. ఇంకొందరేమో.. నిజంగానే శ్రీముఖి లవ్ లో ఫెయిల్ అయ్యిందా? అందుకే అంత ప్రేమగా ప్రియుడి కోసం పిలిచిందా? అని ఆరాతీస్తున్నారు.
ఎంతైనా అనసూయ తర్వాత ఆ రేంజ్ లో శ్రీముఖిలో కూడా నటనా కౌశలం ఉందని ఈ వీడియో చూశాక అందరూ కొనియాడుతున్నారు. ప్రియుడి కోసం శ్రీముకి పడిన బాధ అంతా కనిపిస్తోందని.. నిజంగా ప్రియుడు ఉంటే ఈ వీడియో చూసి కరిగిపోవడం ఖాయమంటున్నారు. మరి శ్రీముఖి విరహ వేదనకు సంబంధించిన వీడియోను కింద చూద్దాం..