
Pawan Kalyan- Sreeleela: ఒక పక్క ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తూనే మరో పక్క మూడు సినిమాలకు కొబ్బరి కాయ కొట్టేసాడు పవన్ కళ్యాణ్.ఒకటి సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న #OG చిత్రం కాగా, మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొంతకాలం క్రితం జరిగింది.ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ ఎప్పటి నుండి జరుగుతాయి అనేది ఎవరికీ క్లారిటీ లేదు కానీ, ఈమధ్యనే తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించేసాడు.
ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు,సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.తమిళం నుండి కేవలం స్టోరీ లైన్ ని తీసుకొని మొత్తం మార్చేసి సరికొత్త కథ ఈ చిత్రాన్ని మలిచాడు డైరెక్టర్ త్రివిక్రమ్.
ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తమిళం ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి పాటలు కానీ, ఫైట్స్ కానీ ఉండవు.కానీ తెలుగు లో పవర్ స్టార్ ఉన్నాడు కాబట్టి పాటలు, ఫైట్స్ మరియు ఎలివేషన్స్ ఇలా పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో మిస్ అవ్వకుండా ఉండేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట.ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ మధ్య ఊర మాస్ సాంగ్ ఉంటుందట.

ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని సమాచారం.ఈ పాట లో మామ – అల్లుడి తో కలిసి శ్రీలీల కూడా డ్యాన్స్ వెయ్యబోతుందట.కేవలం ఈ పాట కోసం ఆమెకి భారీ మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్.అలా ఆద్యంతం ఎన్నో విశేషాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది.చూడాలిమరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించబోతుందో అనేది.