Homeట్రెండింగ్ న్యూస్Youtuber Harsha Sai: కాసింత కళా పోషణ ఉండాలి.. యూట్యూబర్ హర్షసాయి సక్సెస్ సీక్రెట్ ఇదే!

Youtuber Harsha Sai: కాసింత కళా పోషణ ఉండాలి.. యూట్యూబర్ హర్షసాయి సక్సెస్ సీక్రెట్ ఇదే!

Youtuber Harsha Sai: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. ఇంది ఓ సినిమాలో రావుగోపాలరావు డైలాగ్‌.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇది నూటికి నూరు శాతం కరెక్ట్‌.. అందరిలో టాలెంట్‌ ఉంటుంది. ఏదో ఒక రంగంపై పట్టు ఉటుంది. కానీ దానిని బయటపెట్టడం, సృజనాత్మక ఆలోచన ఉన్నవారు ఆరంగంలో సక్సెస్‌ అవుతారు. లేనివారు గుంపులో గోవిందలా మిగిలిపోతారు. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగంచుకోవడం పెరిగిపోయింది. యూట్యూప్‌ ద్వారా వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ పంపాదించేవారు పెరిగారు. అందరితా నానూ వీడియోలు చేస్తే మజా ఏముంటుందన్నాడు.. తనకంటూ ప్రత్యేకత ఉండాలని విభిన్న ఆలోచణతో తనకున్న కళాపోషణను జోడించి అనతికాలంలోనే కోటి మంది సబ్‌స్క్రైబర్‌సను సంపాదించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షసాయి..

Youtuber Harsha Sai
Youtuber Harsha Sai

సాంకేతికతపై పట్టు…
ఇంజినీరింగ్‌ చదువుతన్న విజయనగరం జిల్లాకు చెందిన హర్షసాయి. చిన్నతనం నుంచి సైన్స్‌పై అనికి ఇంట్రెస్ట్‌ ఎక్కువ. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న ఈ యువకుడు అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌ స్టార్‌ అయ్యాడు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. తనకున్న కళాత్మక ఆలోచనతో చిన్నచిన్న మూడేళ్ల క్రితం వీడియోలు చేయడం ప్రారంభించాడు. మొదట తన శరీరంపైనే ఒక వీడియో చేసిన హర్షసాయి.. దానిని మొదట ఫ్రెండ్స్‌కు షేర్‌ చేశారు. వారి సహకారంతో ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో లక్ష మంది ఈ వీడియోను చూశారు. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. కళాత్మకంగా ఏది చేసినా ఆదరణ ఉంటుందని గుర్తించిన హర్ష.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Also Read: KCR- Central Government: కేంద్రాన్ని కడిగేస్తాను.. ‘సర్ఫ్ ఎక్సెల్’ వేసి ఉతికేస్తానన్న కేసీఆర్ కు ఏమైంది?

Youtuber Harsha Sai
Youtuber Harsha Sai

మొదట సైన్స్, ఇంజినీరింగ్‌ అంశాలపై వీడియోస్‌..
‘హర్షసాయి ఫర్‌ యూ ’ యూట్యూబ్‌ చానల్‌లో మొదట హర్షసాయి తనకు ఇష్టమైన సైన్స్‌తోపాటు, పది మందికి ఉపయోగపడే శరీరాకృతి, ఎడ్యుకేషన్‌ పాఠాలను కళాత్మకంగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం ప్రారంభించారు. తాను రోజూ చేసే ఫిట్‌నెస్‌ పనులు కూడా వీడియో చేసేవాడు. ఏ వీడియో వచ్చినా.. హర్షసాయి వాస్‌ కూడా దానికి ప్లస్‌పాయింట్‌. దీంతో యువత చాలామంది హర్ష వీడియోల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో హర్ష యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్స్‌ పెరుగుతూ వచ్చారు. దీంతో సాయికి వచ్చే ఆదాయం కూడా పెరిగింది.

డిఫరెంట్‌ వీడియోస్‌..
హర్షసాయి వీడియోలు ఈ యూట్యూబర్‌ అని వెతికితే చాలా ఇంట్రస్టింగు సమాచారం ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీం పలు భాషల్లో తన వీడియోలు కనిపిస్తాయిం

Youtuber Harsha Sai
Youtuber Harsha Sai

– వెళ్తూ వెళ్తూ, ఓ రిక్షా ఆపుతాడుం కొద్దిదూరం పోగానే ఆపేస్తాడుం తన చేతిలో ఓ పదివేల రూపాయల కట్ట పెట్టేసి, వెళ్లిపోతాడుం అదంతా షూట్‌ అవుతూ ఉంటుందిం ఆ రిక్షా అతని మొహంలో ఆశ్చర్యం.. ఆనందం.

– ఓ పేద పిల్లాడి స్కూల్‌ ఫీజులు చెల్లించడానికి చెక్కులు ఇస్తాడు, ఆ పిల్లాడి సైకిల్‌ కోరిక విని, క్షణాల మీద ఆ సైకిల్‌ను ఆ ఇంట్లోకి రప్పిస్తాడుం చిన్న చిన్న గుడిసెల్లోకి వెళ్లి వాళ్లు ఊహించనంత డబ్బు ఇస్తాడు.

– మొత్తం అయిదు రూపాయల నాణేలు తీసుకుపోయి 20 లక్షల కారు కొంటాడుం. వాటిని లెక్కించడానికి సిబ్బంది పడిన కష్టం. సేకరించడానికి తాను పడిన శ్రమ ఇందులో ఉంటుంది.

– ఒక బార్బర్‌ షాపుకి వెళ్లి, తన స్థితిగతులు తెలుసుకుని, ఓ పక్కా షాప్‌ కట్టించేస్తాడు.

– ఫ్రీ పెట్రోల్‌ పంప్‌ ఓపెన్‌ చేసి, ఉచితంగా పెట్రోల్‌ పోస్తుంటాడు.

– ఒక స్కూల్‌లో దెయ్యం ఉందని పుకార్లు రావడం.. టీచరే చనిపోయి దెయ్యమై తరగతి గదుల్లో తిరుగుతున్నందని ప్రచారం జరిగింది. దీనిని అబద్ధమని తెల్చేందుకు హర్షసాయి రాత్రి స్కూల్‌కు వెళ్లి వీడియో షూట్‌ చేశాడు.

– ఇలాంటివి బోలెడుం లక్షల రూపాయలు ఖర్చవుతూనే ఉంటాయిం వీడియోలు అప్‌లోడ్‌ అవుతూనే ఉంటాయి.. ఫాలోయర్స్‌ పెరుగుతూనే ఉంటారు. రెవిన్యూ వస్తూనే ఉంటుందిం కంప్లీట్‌ డిఫరెంట్‌ స్టోరీం అదేదో స్టోరీ ఏకంగా కోటి వ్యూస్‌ం చాలా వీడియోలు 60, 70, 50 లక్షల వ్యూస్‌ సాధించినట్టు యూట్యూబ్‌ చూపిస్తూ ఉంటుంది.

Youtuber Harsha Sai
Youtuber Harsha Sai

నలుగురికి సాయం చేయాలని..
కొందరికి హర్ష వాయిస్‌ వాయిస్, డిఫరెంట్‌ స్టయిల్‌ నచ్చుతుంది.. కొందరికి నచ్చదు. కానీ డిఫరెంట్‌ వీడియోలు అన్నప్పుడు అదీ డిఫరెంట్‌ ఉండాలని అనుకున్నాడేమో.. అయితే కేవలం జనాన్ని సర్‌ప్రైజ్‌ చేయడం, కొందరికి ఊహించనంత ప్రయోజనం కల్పించడంతో వచ్చేదేముంది..? సార్థకత ఏముంది..? అనుకున్నాడు హర్ష యూట్యూబ్‌ వీడియోస్‌ ద్వారా వచ్చే ఆదాయంతో కొంత పేదలవారికి కష్టాల్లో ఉన్నవారికి ఇవ్వాలనుకున్నాడు. అది కూడా కళాత్మకంగా, కష్టం విలువ తెలిసేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. చిన్నచిన్న వాళ్ల కోరికలు తీరుస్తూ పోతున్నాడు కాబట్టే ఆ వీడియోలు సక్సెస్, దాంతో రెవిన్యూ, పాపులారిటీం నీది భలే స్టోరీ హర్షం కీపిటప్‌. తన చారిటీకి సంబంధించిన వీడియోలు కొత్తగా ఉంటాయి. సగటు ప్రేక్షకుడిని కనెక్ట్‌ చేస్తాయి. చిన్న చిన్న గేమ్స్, డిఫరెంట్‌ ఐడియాలతో జనాన్ని ఎంగేజ్‌ చేస్తాడు. చానెళ్ల ద్వారా వచ్చిన లక్షల ఆదాయాన్ని మళ్లీ వాటి మీదే ఖర్చు చేస్తున్నాడు. ఫాలోవర్లు పెరగడం కోసం, జనాన్ని సర్‌ప్రయిజ్‌లో ముంచెత్తుతూ ఉంటాడు. కీపిటప్‌ హర్షసాయి.

Also Read:Jagan On MLAs: వ్యతిరేకత ఎమ్మెల్యేలకు.. అధికారం జగన్ కా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular