Sunbathing with Snakes : సన్ బాత్ ఎలా చేస్తారు? సూర్యుడు ఉదయిస్తుంటే.. డీ విటమిన్ పొందేందుకు సముద్రం లేదా నదీ తీర ప్రాంతంలో స్నానం చేస్తారు. పండ్ల రసమో కాక్ టై లో తాగుతూ సేద తీరుతారు. వెచ్చటి సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తారు. మన దగ్గరయితే నదీ స్నానాలు చేస్తారు. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే సన్ బాత్ చేస్తారు. కానీ, స్కాట్లాండ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చేసిన సన్ బాత్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఎక్కడా లేని చర్చకు తావిస్తోంది. ఇంతకీ అతడు ఏం చేశాడో మీరూ చదివేయండి.
‘బార్షా పార్క్’ లో..
స్కాట్లాండ్ తెలుసు కదా! బ్రిటన్ పక్కనే ఉంటుంది. శీతలదేశం(ఇప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి). ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి ‘పైష్లీ’ అనే ప్రాంతంలో తాను పెంచుకుంటున్న 20 పాములతో సన్ బాత్‌కు వెళ్లాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న స్థానికులు చూశారు. కొందరు వీడియోలు తీశారు. ఇంకొందరు ఫొటోలు తీశారు. వాటిని ‘బార్షా పార్క్’ అనే ఫేస్ బుక్ పేజీలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అతడు పాములు తీసుకెళ్తున్న తీరును కొందరు సమర్థించారు. మరికొందరు వ్యతిరేకించారు. ఇంకొందరయితే పాములు తీసుకెళ్లాలా? లేదా? అని తమ సందేహాన్ని వెలిబుచ్చారు. ‘అతడు సాధారణ సందర్శకుడు. ఎవరికీ ఎటువంటి హాని చేయడం లేదు. ఆ పాములను అదుపులో ఉంచుతున్నాడని’ ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘అతడు పాములను తీసుకెళ్తున్న తీరును నేను చూశాను. ఆ పాములు నా పాదాల మీదుగా పాకాయి. నాకు ఒకింత భయం వేసింది. ఆ పాములు చూసేందుకు బాగున్నాయి. అవంటే నాకు భయం లేదు’’ అని ఓ యువకుడు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
కుక్కలు కాదు పరుగెత్తేది
‘ఇది వింతగా ఉంది. ఎందుకంటే మీరు పార్కు చుట్టూ కుక్కలు పరిగెత్తాలని ఆశిస్తారు. పాములు అలా చేయాలని అనుకోరు. ఆ పాములను కలిగి ఉన్న వ్యక్తి చాలా తెలివైన వాడు. ఆ పాములు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎండను ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. చాలా మంది ప్రజలు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారని’ ఓ మహిళ వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న ‘రైన్ ఫ్రూషైర్ కౌన్సిల్’ బార్షా పార్క్ ఫేస్ బుక్ పేజీలో స్పందించింది. ‘బార్షా పార్క్‌లోకి పాములను తీసుకొచ్చేందుకు ఎవరికీ అనుమతి లేదు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేస్తాం. పార్క్‌లో ఎవరైనా పాములతో ఉన్నారని తెలిస్తే దయచేసి 101 నంబర్‌కు ఫోన్ చేయండి. పాములు వంటి విష జంతువులను పార్క్‌లోకి తీసుకురావద్దు’ అని స్పష్టం చేసింది. ఏదీ ఏమైనప్పటికీ ఆ వ్యక్తి చేసిన ‘స్నేక్ సన్ బాత్’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,.
Okay, make sure you're sitting down for this one.
Someone has been bringing their pet snakes into my local park. And the response from everyone is…that's fine? pic.twitter.com/ckdnRfqpBm
— Jamie Kinlochan (@JamieKinlochan) June 14, 2023