https://oktelugu.com/

Bigg Boss 6 Telugu : ‘శ్రీహాన్ నా వెనుక గోతులు తీసే రకం’ అంటూ నాగార్జున ముందు ఆరోపించిన రేవంత్

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రేక్షకులు ఏ ఎపిసోడ్ చూసిన చూడకపోయినా వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం మిస్ అవ్వరు..ఎందుకంటే ఎలిమినేషన్స్ మరియు ట్విస్టులతో పాటుగా ఫన్నీ టాస్కులు కూడా పుష్కలంగా ఉంటాయి..నిజమైన ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ కి వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రమే అని చెప్పాలి..ఇక ఈ సీజన్ ఇప్పుడు చివరిదశకు చేరుకుంది..21 కంటెస్టెంట్స్ తో కళకళలాడిన బిగ్ బాస్ హౌస్..ఇప్పుడు అందరూ ఎలిమినేట్ అవ్వడం తో బోసిపోయింది. మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2022 / 08:36 AM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రేక్షకులు ఏ ఎపిసోడ్ చూసిన చూడకపోయినా వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం మిస్ అవ్వరు..ఎందుకంటే ఎలిమినేషన్స్ మరియు ట్విస్టులతో పాటుగా ఫన్నీ టాస్కులు కూడా పుష్కలంగా ఉంటాయి..నిజమైన ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ కి వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రమే అని చెప్పాలి..ఇక ఈ సీజన్ ఇప్పుడు చివరిదశకు చేరుకుంది..21 కంటెస్టెంట్స్ తో కళకళలాడిన బిగ్ బాస్ హౌస్..ఇప్పుడు అందరూ ఎలిమినేట్ అవ్వడం తో బోసిపోయింది.

    మరో వారం లో సీజన్ కూడా ముగియబోతుంది..ఈ వారం మొత్తం బిగ్ బాస్ కుదించిన విన్నర్ క్యాష్ ప్రైజ్ ని తిరిగి రప్పించుకునే టాస్కులను నిర్వహించాడు..ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడారు..38 లక్షలు ఉన్న క్యాష్ ప్రైజ్ ని 47 లక్షలకు పెంచుకున్నారు..దీనితో పాటుగా కన్ఫెషన్ రూమ్ లో దెయ్యాల కొంప సెట్టింగ్ మంచి ఎంటర్టైన్మెంట్ ని పంచింది..అందరిలోకి ఆదిరెడ్డి ట్రాక్ కడుపుబ్బా నవ్వించింది..ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఫన్ తో నిండిపోనుంది..అక్కినేని నాగార్జున హౌస్ మేట్స్ అందరి మధ్య ఫిట్టింగ్ పెట్టేసాడు.

    ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో శ్రీహన్ ని నాగార్జున అడుగుతూ ‘శ్రీహాన్ నువ్వు రేవంత్ కంటే ఎందుకు బెస్ట్..? నీకు ఓట్లు ఎందుకు వెయ్యాలి..నిన్ను ఎందుకు గెలిపించాలి’ అని అడుగుతాడు..అప్పుడు శ్రీహాన్ అందుకు సమాధానం చెప్తూ ‘ప్రతీ హౌస్ మాటే ఎదో ఒక టైం లో తప్పులు అనేవి చేస్తారు..అది చాలా సహజం..మనకి ఉండాల్సింది ఏమిటి అంటే ఆ తప్పులను అంగీకరించడం..ఆ లక్షణం ఎందుకో రేవంత్ లో నాకు తక్కువ అనిపించింది..అందుకే నేను రేవంత్ కంటే బెస్ట్’ అని అంటాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘సార్ ఒకటి గుర్తుకు వచ్చింది..అది నేను ఇప్పుడు చెప్పొచ్చా’ అంటాడు..అప్పుడు నాగార్జున ‘ఏమి చెప్తావు..రేవంత్ ఫ్లిప్పర్..నేను కాదు అంటావా’ అని అంటాడు..అప్పుడు శ్రీహాన్ ‘అయ్యో అది కాదు సార్’ అని అంటాడు..అప్పుడు నాగార్జున ‘మొన్న ఆది రెడ్డి తో అదే కదా చెప్తున్నావు’ అని అంటాడు..అప్పుడు రేవంత్ మధ్యలో కలిపించుకొని ‘శ్రీహాన్ నా వెనుక చాలా మాట్లాడుతాడు సార్..నాకు తెలుసు అది’ అని అంటాడు..వీళ్లిద్దరి మధ్య అగ్గి అయితే రాజేసాడు నాగార్జున..వచ్చే వారం లో అది ఎలాంటి గొడవలకు దారి తీస్తుందో చూడాలి.

    https://www.youtube.com/watch?v=a5tYfdlgRb0