Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ హిట్స్ ఇస్తూ దూసుకుపోతుంది శ్రియా శరన్. ఆమె లేటెస్ట్ మూవీ దృశ్యం 2 మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ చిత్రంకి రీమేక్ గా అదే టైటిల్ తో హిందీలో తెరకెక్కించారు. తెలుగు, మలయాళ భాషల్లో మీనా చేసిన పాత్రలో హిందీలో శ్రియా శరన్ చేశారు. దృశ్యం 2 మూవీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చేసింది. శ్రియా-అజయ్ దేవ్ గణ్ కాంబో ఆర్ ఆర్ ఆర్ లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే.

కీలకమైన రామరాజు పేరెంట్స్ గా అజయ్ దేవ్ గణ్-శ్రియా నటించారు. ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1200 కోట్ల వసూళ్లకు పైగా రాబట్టింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని ఆస్కార్ బరిలో నిలిచింది. రాజమౌళి చాలా ఏళ్ల తర్వాత శ్రియాకు ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ తో ఆయన చేసిన మొదటి చిత్రం ఛత్రపతి లో శ్రియా హీరోయిన్ గా నటించారు. అప్పుడు శ్రియా స్టార్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు.

స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూసింది శ్రియా. దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలేసింది. రెండు తరాల సూపర్ స్టార్స్ తో జత కట్టిన ఘనత శ్రియాదే. జూనియర్ ఎన్టీఆర్ టు మెగాస్టార్ చిరంజీవి వరకు అందరినీ కవర్ చేసింది. ఆ రోజుల్లో శ్రియా ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉండేది మరి. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ని చక్కగా బాలన్స్ చేసింది. స్టార్ గా కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుంది. అన్ని విధాలా తనను అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్ కలిగిన విదేశీయుడిని భర్తగా తెచ్చుకుంది.

లాక్ డౌన్ సమయంలో సీక్రెట్ గా తల్లై ఆడపిల్లకు జన్మనిచ్చింది. శ్రియా తల్లయ్యారన్న సంగతి మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రెగ్నెన్సీ వలన శరీరంలో మార్పులు వస్తాయి. అప్పుడు నేను బాడీ షేమింగ్ కి గురికావచ్చు. సెలబ్రిటీగా అందరి దృష్టి నాపై ఉంటుంది. అవమానాలు పడాల్సి వస్తుందేమోనని తల్లైన విషయం దాచానని తర్వాత శ్రియా వివరణ ఇచ్చారు. నటిగా ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉంటున్నాయి. అదే సమయంలో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. శ్రియా లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతగా స్కిన్ షో చేసింది. శ్రియా గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.