https://oktelugu.com/

Shanmukh Jaswanth : మరో అమ్మాయిని లైన్లో పెట్టిన షణ్ముఖ్… దీప్తి సునయనకు అన్యాయం అంటూ గగ్గోలు

Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఓ అమ్మాయి చేయిపట్టుకుని రొమాంటిక్ ఫోజిచ్చిన ఈ యూట్యూబ్ స్టార్ ఇకపై వాళ్ళు అయ్యయ్యో అంటారని కామెంట్ పెట్టాడు. ఇది నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఇంతకీ ఆ కొత్త అమ్మాయి ఎవరంటే… షణ్ముఖ్ ఏడాదిన్నరగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నాడు. ఆయన తన చిరకాల ప్రేయసి దీప్తి సునైనతో విడిపోయాడు. 2021లో వీరిద్దరూ బ్రేక్ చెప్పుకున్నారు. చెప్పాలంటే దీప్తినే షణ్ముఖ్ ని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2023 / 09:44 AM IST
    Follow us on

    Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఓ అమ్మాయి చేయిపట్టుకుని రొమాంటిక్ ఫోజిచ్చిన ఈ యూట్యూబ్ స్టార్ ఇకపై వాళ్ళు అయ్యయ్యో అంటారని కామెంట్ పెట్టాడు. ఇది నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఇంతకీ ఆ కొత్త అమ్మాయి ఎవరంటే… షణ్ముఖ్ ఏడాదిన్నరగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నాడు. ఆయన తన చిరకాల ప్రేయసి దీప్తి సునైనతో విడిపోయాడు. 2021లో వీరిద్దరూ బ్రేక్ చెప్పుకున్నారు. చెప్పాలంటే దీప్తినే షణ్ముఖ్ ని వదిలేసింది. ఇందుకు కారణాలు ఏంటనేది తెలియదు. ఒక వాదన మాత్రం ప్రచారంలో ఉంది.

    బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. స్నేహం పేరుతో వీరు హద్దులు దాటి ప్రవర్తించారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఫైనల్ వరకూ వెళ్లిన ఈ జంట సీజన్ మొత్తం అదే ప్రవర్తన కొనసాగించారు. బయట ఇద్దరికీ లవర్స్ ఉన్నారు. అయినప్పటికీ కెమెరాల ముందు ప్రేమకథ నడిపారు. సిరితో హౌస్లో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు నచ్చని దీప్తి బ్రేకప్ చెప్పారనే ప్రచారం జరిగింది. ఇటీవల సిరి ఈ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం. తెలియక తప్పుచేశానంటూ తన లవర్ శ్రీహాన్ కి సారీ చెప్పింది.

    నెలలు గడిచినా దీప్తి-షణ్ముఖ్ కలవలేదు. ఇటీవల కొంచెం దగ్గరైనట్లు కనిపించారు. కలిసి కొన్ని ఈవెంట్స్ చేశారని సమాచారం. దీప్తి బర్త్ డే రోజు షణ్ముఖ్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే D’ అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. అయినా దీప్తి అతనికి దగ్గర కాలేదని తెలుస్తుంది. ఇద్దరూ ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉన్నారు. షణ్ముఖ్ ఆ మధ్య లగ్జరీ కార్ కొన్నాడు. వరుసగా మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు.

    ఆయన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఓ అమ్మాయితో రొమాంటిక్ ఫోజిచ్చిన షణ్ముఖ్… అందరూ ఇంకా అయ్యాయో అనాలి’ అని పెట్టాడు. అయితే ఈ రొమాంటిక్ ఫోటో తన లేటెస్ట్ ప్రాజెక్ట్ లోనిది. నటి ఫణి పూజితతో ‘అయ్యయ్యో’ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలవుతుండగా అది తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. అది వైరల్ అవుతుంది. కాగా దీప్తి-షణ్ముఖ్ కి కామన్ ఫ్యాన్స్ ఉన్నారు. మరలా ఈ జంట కలిసిపోవాలని వారు కోరుకుంటున్నారు.