
Virat Kohli- Shah Rukh Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో అరుదైన చిత్రం ఆవిష్కృతమైంది. క్రికెట్ బాద్షా విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కలిసి స్టేడియంలో సందడి చేశారు. ఈ ఇద్దరు కలిసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇరువురి అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023వ సీజన్ 16వ ఎడిషన్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బోనీ చేసింది. సొంత పిచ్ పై చెలరేగిన కోల్కతా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ఏకంగా 81 పరుగులు తేడాతో మట్టి కరిపించింది. తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో డక్వర్త్ లూయిస్ మెథడ్ లో ఓటమిపాలైన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్థికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్ లో, ఆ తరువాత బౌలింగ్ లో మెరుగైన ఆట తీరును ప్రదర్శించి విజయాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఎగబాకింది. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలినా.. ముగ్గురే ముగ్గురు భారీ స్కోర్లు సాధించి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు.

ఓపెనర్ రహమనుల్లా గుర్బజ్ 57, మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ 46, లోయర్ ఆర్డర్లో బౌలర్ శార్దూల్ ఠాకూర్ 68 పరుగులతో విరుచుకుపడడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ మరిచిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే మూడు సిక్సులు, 9 ఫోర్లతో ఆర్సిబి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక సాధనలో ఆర్సిబి జట్టు చేతులెత్తేసింది. మొదటి మ్యాచ్లో బ్యాట్ జులిపించిన డూప్లెస్సెస్ ఈ మ్యాచ్లో 23 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 21 పరుగులు మాత్రమే చేశారు. ఓపెనర్లు ఇద్దరు వేగంగా పరుగులు సాధించే క్రమంలో కొద్ది పరుగులు వ్యవధిలోనే అవుట్ కావడంతో ఆర్సిబి ఏ దశలోనూ విజయం దశగా సాగలేకపోయింది.

మ్యాచ్ కు హైలైట్ గా నిలిచిన బాద్షాలు..
ఈ మ్యాచ్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు బాలీవుడ్ బాద్షా, కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ వీక్షించేందుకు గ్రౌండ్ కు వచ్చిన షారుక్ ఖాన్ ఆద్యంతం హుషారుగా కనిపించాడు. తన కో ఫౌండర్ జూహీ చావ్లా తో కలిసి ఈడెన్ గార్డెన్స్ లో సందడి చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి స్టేడియంలోనే ఉన్నారు. వీఐపీ బాక్స్ లో ఉండి మ్యాచ్ మొత్తాన్ని చూశారు. శార్ధుల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్లో సొంత జట్టు భారీ తేడాతో విజయం సాధించడంతో షారుఖ్ ఖాన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రౌండ్లో ప్రత్యక్షం అయ్యాడు. విరాట్ కోహ్లీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఝామే జో పఠాన్ పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రారంభం అయ్యేంతవరకు ఇద్దరూ కలిసే తిరిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇరువురి అభిమానులు పెద్ద ఎత్తున వీటిని షేర్ చేస్తూ ఆనందాన్ని కామెంట్లు రూపంలో వ్యక్తం చేశారు. ఇద్దరు బాద్షాలు.. ఒకే పిక్ లో అంటూ కొందరు, లెజెండ్స్ ఆన్ వన్ పిక్ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
SRK cheered up virat kohli by hugging and teaching him jhoome jo pathaan step. i guess this fanwar should end here now.pic.twitter.com/8F8VPo4S1w
— ح (@hmmbly) April 6, 2023