Kannada Actor Manjunath: కన్నడ పరిశ్రమలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హీరో మంజునాథ్ అలియాస్ సంజు సెక్స్ రాకెట్ లో దొరికిపోయాడు. పక్కా ఆధారాలతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంజునాథ్ చాలా కాలంగా వ్యభిచార దందా నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. పరిశ్రమలో తనకున్న పరిచయాలతో కొందరిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడట. అలాగే బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడట. మంజునాథ్ నేరాలపై స్పష్టమైన సమాచారం అందుకొని అతన్ని అరెస్ట్ చేశారు.

బెంగుళూరు వేదికగా హీరో మంజునాథ్ వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. కెంగేరి డెంటల్ హాస్పిటల్ సమీపంలో ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా తన అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో సీబీఐ పోలీసులు రెండు మూడు ప్రదేశాలపై తెల్లవారు ఝామున దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు పట్టుబట్టారు. వారిని పోలీసులు తమ స్టైల్ లో విచారించగా మంజునాథ్ పేరు చెప్పారు.
మంజునాథ్ ఏళ్లుగా ఈ దందా నడుపుతున్నట్లు సమాచారం. అతడు కొన్ని యాప్స్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నాడు. మంజునాథ్ నేరం చేసినట్లు ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. మంజునాథ్ 2019లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ న్యూరాన్ చిత్రంలో నటించారు. ఆయన మళ్ళీ మరో చిత్రం చేయలేదు. యాక్టింగ్ పక్కన పెట్టి వ్యభిచార దందా ప్రధాన వృత్తిగా మార్చుకున్నాడు.

లొకాంటో అనే యాప్ రూపొందించి అందులో అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేసి విటులను ఆకర్షిస్తున్నారు. మంజునాథ్ ని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. చిత్ర పరిశ్రమలో మంచి చెడు రెండూ ఉంటాయి. కష్టపడి పైకి రావడం చేత కానీ కొందరు నటులు ఇలాంటి అడ్డదారులు వెతుక్కుంటారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు. డ్రగ్ దందా కూడా ఇలాంటి వారికి ప్రధాన ఆదాయమార్గంగా ఉంది. గతంలో కన్నడ పరిశ్రమను డ్రగ్ కేసు ఊపేసింది. హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ అయ్యారు.