Samantha: సమంత ఫిలాసపీ ఇతర హీరోయిన్స్ కి భిన్నంగా ఉంటుంది. చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకొని వెళ్లాలనే సిద్ధాంతాలు నమ్మదు. నచ్చినట్లు బ్రతకడమే బెస్ట్ పాలసీ అంటుంది. సమంత తన లైఫ్ స్టైల్, ఆలోచనా విధానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. సమంత తన జీవితానికి పెట్టుకున్న మొదటి సిద్ధాంతం… నీ కోసం నువ్వు బ్రతుకు. ఈ భూమ్మీదికి వచ్చింది ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు. మన సంతోషమే ముఖ్యం. సినిమా అంటే నాకు ఎక్కడలేని ఫ్యాషన్. పాత్ర నచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. డబ్బు కోసం వెంపర్లాడే రకంకాను. ఎంచుకున్న పాత్రకు వంద శాతం న్యాయం చేసేలా చూస్తాను, అని సమంత చెప్పారు.

నాకు నేనే పెద్ద విమర్శకురాలిని. నాలోని లోపాలను నేనే మొదట గుర్తిస్తాను. వాటిని సరి చేసుకొని మెరుగయ్యే ప్రయత్నం చేస్తాను. నా సక్సెస్ సీక్రెట్ బహుశా ఇదే కావచని సమంత అన్నారు. టైం బాగోనప్పుడు ఏది చేసినా బెడిసి కొడుతుంది. అలాంటప్పుడు అతిగా ఆలోచించడం అనవసరం. నేను కమ్మగా పడుకొని నిద్రపోతా. జరిగిన డామేజ్ మర్చిపోయే ప్రయత్నం చేస్తానని సమంత చెబుతున్నారు. ఫస్ట్ మన దగ్గర ఉన్న వాటిని ఇష్టపడం మొదలుపెడితే మనకు అవసరం ఉన్నవన్నీ అవే వెతుక్కుంటూ వస్తాయి.
ఇక నాకు కోపం వస్తే జిమ్ కి వెళ్ళిపోతా. అక్కడ పిచ్చి పిచ్చి కసరత్తులు చేస్తా. అలా చేస్తే నా కోపం తగ్గిపోయి నార్మల్ అయిపోతా. యాంగర్ మేనేజ్మెంట్ కోసం నేను వాడే బెస్ట్ టెక్నిక్ ఇదే అంటూ సమంత వెల్లడించారు. ఇవి సమంత తన లైఫ్ కి పెట్టుకున్న కొన్ని నియమాలు. ఎవరు ఏమనుకున్నా సమంత వీటినే ఫాలో అవుతుంది. అసలు నాగ చైతన్యతో విబేధాలకు సమంత సిద్ధాంతాలే కారణమని ఒక వాదన ఉంది. స్వేఛ్చకు అడ్డు వస్తున్న నాగ చైతన్యతో బంధాన్ని సమంత వద్దనుకున్నారట.

కాగా సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే భయానక రోగంతో యుద్ధం చేస్తున్నారు. ఈ వ్యాధి చికిత్స కోసం సమంత పలు దేశాలకు వెళుతున్నారని ప్రచారం అవుతుంది. ట్రీట్మెంట్ కోసం సమంత దక్షిణ కొరియా వెళ్లారని వార్తలు వచ్చాయి. కెరీర్ పరంగా సమంత జోరు చూపిస్తున్నారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ యశోద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన యశోద చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇక తెలుగులో సమంత ఖుషి, శాకుంతలం చిత్రాలు చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీపై అంచనాలు ఉన్నాయి.