Samantha Vijay Devarakonda: బ్రేకింగ్: నదిలో పడిపోయిన సమంత-విజయ్ దేవరకొండ కారు.. తీవ్ర గాయాలు!

Samantha Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ-సమంత ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. వారికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ కశ్మీర్ లో సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ సీన్ తీస్తుండగా వీరద్దరూ ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయినట్లు తెలిసింది. వీరికి తీవ్ర గాయాలయ్యాయని.. ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా […]

Written By: NARESH, Updated On : May 26, 2022 3:34 pm

Samantha, Vijay Devarakonda

Follow us on

Samantha Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ-సమంత ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. వారికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ కశ్మీర్ లో సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ సీన్ తీస్తుండగా వీరద్దరూ ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయినట్లు తెలిసింది. వీరికి తీవ్ర గాయాలయ్యాయని.. ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Samantha, Vijay Devarakonda

కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా విజయ్-సమంతల కారుకు ప్రమాదం జరిగింది. ఈ సన్నివేశం చాలా టఫ్ గా తీశారని.. నదికి రెండువైపులా కట్టిన తాడుపై సమంత-విజయ్ కారులో నడపుతూ వెళ్లాలని.. కానీ దురదృష్టవశాత్తూ వాహనం నదిలో లోతైన నీటిలో పడిపోయినట్లు తెలిసింది. ఇద్దరి వెన్నుముఖలకు తీవ్రగాయాలైనట్లు చెబుతున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశం కోసం షూటింగ్ చేస్తుండగా విజయ్-సమంత నదిలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. దీంతో షూటింగ్ నిలిపివేశారు.

Also Read: Vijay Sai Reddy Impress Delhi BJP: బీజేపీ అగ్ర నాయకత్వం ప్రాపకం కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి

ప్రమాదం జరిగిన వెంటనే విజయ్, సమంతలను ముందుగా దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హోటల్ కు తరలించారు. వైద్యులతో చికిత్స అందించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్-సమంత జంటగా ఒక ప్రేమకథా చిత్రాన్ని తీస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు పెట్టారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ స్టైలిష్ లుక్ లో కనిపించగా.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథా చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదలకు ప్లాన్ చేశారు. విజయ్ కు ఇది 11వ సినిమా.. మహానటి తర్వాత సమంత-విజయ్ కలిసి నటిస్తున్న చిత్రమిదీ.. కానీ ఇప్పుడు విజయ్-సమంతలకు గాయాలు కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

Also Read: Bald Groom: పెళ్లి జరుగుతుండగానే వీడిన విగ్గు.. వివాహం వద్దన్న వధువు

Recommended Videos: