
Samantha: సమంత-నాగ చైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతుంది. 2021 అక్టోబర్ లో అధికారిక ప్రకటన చేసినప్పటికీ అందుకు కొన్ని నెలల ముందు నుండే విడివిడిగా ఉంటున్నారు. విడాకుల తర్వాత సమంత ఎవరిపై ఆరోపణలు చేయలేదు. నేరుగా నాగ చైతన్యను ఆమె తప్పుబట్టలేదు. విడాకులకు కారణాలు ఇవే అని కూడా చెప్పలేదు. పరోక్షంగా మాత్రం నాగ చైతన్య మీద సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టేవారు. అయితే మొదటిసారి ఆమె కొన్ని విషయాల గురించి ఓపెన్ అయ్యారు. వివాహం, విడాకులు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
విడాకులు తీసుకున్న వెంటనే నాకు పుష్ప మూవీలో ‘ఊ అంటావా మామ’ సాంగ్ ఆఫర్ వచ్చింది. చాలా మంది ఆ సాంగ్ చేయవద్దన్నారు. పేరెంట్స్, సన్నిహితులు, మితృలు ఫోన్ చేసి ఆ పాటలో నటించకు అని సలహా ఇచ్చారు. విడాకులు తీసుకున్న నువ్వు అప్పుడే ఇలాంటి సాంగ్స్ లో నటించడం వలన నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారని సలహా ఇచ్చారు. తప్పు చేయనప్పుడు నేనెందుకు శిక్ష అనుభవించాలి.
ఎవరేమనుకున్నా పర్లేదని ఆ సాంగ్ చేశాను. వైవాహిక బంధంలో నేను వంద శాతం కరెక్ట్ గా ఉన్నాను. అయినా ఎందుకో అది కలిసి రాలేదు. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కోవాలి.. అని సమంత అన్నారు. పరోక్షంగా నాగ చైతన్య మీద ఆమె ఆరోపణలు చేసినట్లు అయ్యింది. భార్యగా నేను పర్ఫెక్ట్, ఆయనదే తప్పు అని సమంత చెప్పకనే చెప్పింది. మరి నాగ చైతన్య చేసిన ఆ తప్పు ఏంటనేది ఆసక్తికరం.

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మీద కోపంతోనే ఊ అంటావా మామ సాంగ్ చేసినట్లు చెప్పడం కొస మెరుపు. చైతన్య మీద ఆమె చాలా కోపంగా ఉన్నారన్నది నిజం. అందుకు కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. విడాకుల విషయంలో సమంతనే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదని, ఎఫైర్స్ పెట్టుకున్నారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటున్నారు.