Samantha: ఇన్ స్టాగ్రామ్(Instagram) ని వినియోగించే ప్రతీ ఒక్కరికి అలేఖ్య పికిల్స్(Alekhya Chitti Pickles) తెలిసే ఉంటుంది. రకరకాల వెరైటీ లతో కూడిన పికిల్స్ ని భారీ రేట్స్ కి ఆమె అమ్ముతూ ఉంటుంది. రీసెంట్ గానే ఒక కస్టమర్ ఈమెతో జరిపిన సంభాషణ బాగా వైరల్ అయ్యింది. ఇంత రేట్స్ ఉన్నాయేంటి అని అడిగితే, ఆ కస్టమర్ ని అడ్డమైన బూతులు తిడుతూ సోషల్ ఒక ఆడియో మెసేజ్ ని పెట్టింది. ఆ ఆడియో మెసేజ్ ని స్క్రీన్ రికార్డు చేసి ఒక ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. కొంతమంది అలేఖ్య మాట తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కస్టమర్ అంత మర్యాదగా మాట్లాడినా, ఈమె ఈ రేంజ్ రెస్పాన్స్ ఇవ్వడం మానవీయ కోణం కాదనీ, ఇది మంచి పద్దతి కాదంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. అదే సమయం లో అలేఖ్య పై ట్రోలర్స్ ఫన్నీ మీమ్స్ ని కూడా తయారు చేస్తున్నారు.
Also Read: ‘ఆర్య 2’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ ఉందంటే!
అలా సమంత(Samantha Ruth Prabhu) ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పై వేసిన ఒక ఫన్నీ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఒక అభిమాని ‘హాయ్ సామ్..ఐ లవ్ యూ’ అని ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు. అప్పుడు సమంత వెంటనే ‘మీ ఇంట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నాయా’ అని అడగగా, దానికి ఆ అభిమాని లేవు అని సమాధానం ఇస్తాడు. అందుకు సమంత సమాధానం చెప్తూ ‘ఛీ..ముందు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి రా వెదవ’ అని అంటుంది. ఈ ఫన్నీ మీమ్ కేవలం ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే కాదు, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కూడా తెగ చక్కర్లు కొడుతోంది. కేవలం సమంత ని మాత్రమే కాదు, ఇతర హీరోలను, హీరోయిన్లను కూడా ఉపయోగించుకుంటూ అలేఖ్య థీమ్ మీద ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే అలేఖ్య కూడా కాసేపటి క్రితమే తన ఆడియో రికార్డు పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘రోజుకి మాకు వేళల్లో మెసేజిలు వస్తుంటాయి. కొంతమంది మంచి కస్టమర్స్ ఉంటారు, కొంతమంది అసభ్యంగా మాట్లాడే కస్టమర్స్ ఉంటారు. అలాంటి కస్టమర్స్ ని చూసినప్పుడు రోజంతా మూడ్ చెడిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి మాటలే వస్తుంటాయి. నాతో అసభ్యంగా మాట్లాడిన కస్టమర్ కి సమాధానం చెప్పబోయి, వేరే అతనికి సమాధానం చెప్పాను. ఇది కేవలం పొరపాటు మాత్రమే, కావాలని చేసింది కాదు, నేను ఆడియో మెసేజ్ పంపిన అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య. ఆమె మాట్లాడిన మాటలను నెటిజెన్స్ అసలు నమ్మడం లేదు. స్పష్టంగా అతనికే సమాధానం చెప్తున్నట్టు అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ ఆడియో రికార్డు బాగా వైరల్ అవ్వడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం అలేఖ్య నాటకాలు ఆడుతుంది అంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్.