Homeట్రెండింగ్ న్యూస్Samantha Challenge: సమంత ఛాలెంజ్.. చేతులేత్తేసిన బాయ్ ఫ్రెండ్..!

Samantha Challenge: సమంత ఛాలెంజ్.. చేతులేత్తేసిన బాయ్ ఫ్రెండ్..!

Samantha Challenge: స్టార్ హీరోయిన్ సమంత ఫిట్ నెట్ పై ఎంత శ్రద్ధ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయాన్నే యోగా, జిమ్ వంటి కసరత్తులు చేస్తూ స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే తన వ్యాయమానికి సంబంధించిన పిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఫిట్ నెస్ పై అవగాహన కల్పిస్తుంటారు.

Samantha
Samantha

తాజాగా సమంత ఒక కొత్త వర్కౌట్ ఛాలెంజ్ ను తీసుకొచ్చారు. ముందుగా ఈ  చాలెంజ్ ను సమంత పూర్తి చేసి వీడియోను తన ఇన్ స్ట్రా స్టోరీస్ లో అప్ లోడ్ చేసింది. ఆ తర్వాత తన చాలెంజ్ ను తన స్నేహితులైన రోహిత్ భట్కర్, రంభియా, ప్రీతమ్ జువల్కర్ లకు విసిరింది. ఈ ఛాలెంజ్ ను తొలుత మేకప్ ఆర్టిస్ట్ రంభియా సక్సస్ ఫుల్ గా పూర్తి చేశారు.

ఆ తర్వాత స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక చివరగా ప్రీతమ్ జువల్కర్ ట్రై చేశాడు. అయితే ప్రీతమ్ చాలెంజ్ చేసేందుకు ప్రయత్నించి ముందుకు పడిపోతాడు. దీంతో సమంత నవ్వాపుకోలేక పోతుంది. ‘తాను ప్రీతమ్ ను ఎంకరేజ్ చేద్దామనుకున్నా.. కానీ ప్రీతమ్ వల్ల కాలేదు.. ఓడిపోయాడు.. పాపం ప్రీతమ్’ అంటూ నవ్వుతూ చెప్పింది.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీ బీజీగా గడుపుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శకుంతలం’ మూవీ త్వరలోనే విడుదలకు ముస్తాబు అవుతోంది. తెలుగుతోపాటు బాలీవుడ్లోనూ పలు సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ మూవీలో సమంత బై-సెక్సువల్ యువతిగా కన్పించబోతుండటం విశేషం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] ‘Bhimla Nayak’ Family Pick Viral:  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న  ‘భీమ్లా నాయక్’ సినిమా   ఫిబ్రవరి 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే,  ఇప్పుడు, ఈ చిత్రంలోని   ఒక ఫోటో  తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అంటే..  పవన్  – నిత్యామీనన్  భార్యాభర్తలుగా కనిపిస్తూ ఉండగా.. వారి చేతిలో ఒక బాబు కూడా ఉన్నాడు. మొత్తానికి ‘భీమ్లా నాయక్’ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఈ ఫోటో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. […]

Comments are closed.

Exit mobile version