https://oktelugu.com/

Shakunthalam Collections : ‘శాకుంతలం’ మొదటి రోజు వసూళ్లు.ఆ ప్రాంతం లో ‘సున్నా’ టికెట్స్ అమ్ముడుపోయాయి

Shakunthalam Collections : సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ శాకుంతలం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం, మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదలైంది. మహాభారతం ప్రారంభానికి ముందు శకుంతల మరియు దుష్యంత మహారాజు మధ్య చిగురించిన ప్రేమ ని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2023 / 09:42 PM IST
    Follow us on

    Shakunthalam Collections : సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ శాకుంతలం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం, మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదలైంది.

    మహాభారతం ప్రారంభానికి ముందు శకుంతల మరియు దుష్యంత మహారాజు మధ్య చిగురించిన ప్రేమ ని అద్భుతంగా వర్ణిస్తూ కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంధాన్ని అధ్యయనం చేసి గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో మేకర్స్ కి మింగుడు పడలేని పరిస్థితి ఏర్పడింది.కొన్ని మాస్ సెంటర్స్ లో ఈ చిత్రానికి రోజు మొత్తానికి కలిపి ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదట.

    వరుస హిట్స్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ కి అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా ఈ ‘శాకుంతలం’ చిత్రం నిలిచిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.నిర్మాత దిల్ రాజు నుండి ఇంత నాసిరకపు క్వాలిటీ తో ఒక సినిమా రావడం తొలిసారి చూస్తున్నాము అంటూ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు.

    ఇక ఇతర బాషల గురించి ఏమని మాట్లాడుతాం.షేర్ సంగతి పక్కన పెడితే కనీసం గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట.దిల్ రాజు కి గడిచిన రెండు దశాబ్దాలలో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం నిలిచిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.గుణశేఖర్ ఇకనైనా సినిమాలను తియ్యడం ఆపేసి రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అని కొంతమంది సలహాలు ఇస్తున్నారు.