Payal Rajput : పొట్టిలాగు ధరించి పాయల్ సూపర్ హాట్ లుక్… చలిలో సెగలు పుట్టిస్తున్న ఆర్ఎక్స్ 100 భామ!

Payal Rajputh : పాయల్ రాజ్ పుత్ అంటే ఆర్ఎక్స్ 100 మూవీ గుర్తొస్తుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా విడుదలైన ఆ చిత్రం ఓ సంచలనం. యూత్ ఓ రేంజ్ లో ఆర్ఎక్స్ 100 చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బోల్డ్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోయి నటించారు. అజయ్ భూపతి సరికొత్తగా ఆమె క్యారెక్టర్ రూపొందించారు. ఆ మూవీతో దర్శకుడు, హీరోతో పాటు హీరోయిన్ పాయల్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దాంతో టాలీవుడ్ ని […]

Written By: NARESH, Updated On : November 23, 2022 8:58 pm
Follow us on

Payal Rajputh : పాయల్ రాజ్ పుత్ అంటే ఆర్ఎక్స్ 100 మూవీ గుర్తొస్తుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా విడుదలైన ఆ చిత్రం ఓ సంచలనం. యూత్ ఓ రేంజ్ లో ఆర్ఎక్స్ 100 చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బోల్డ్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోయి నటించారు. అజయ్ భూపతి సరికొత్తగా ఆమె క్యారెక్టర్ రూపొందించారు. ఆ మూవీతో దర్శకుడు, హీరోతో పాటు హీరోయిన్ పాయల్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దాంతో టాలీవుడ్ ని పాయల్ ఏలేస్తుంది అనుకున్నారు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు పాయల్ కి కాలం కలిసిరాలేదు. పరిశ్రమలో ఫేట్ నిర్ణయించేది సక్సెస్ మాత్రమే. టాలెంట్ తో సంబంధం లేకుండా అదృష్టంతో అందలమెక్కిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆవగింజంత అదృష్టం కూడా లేని పాయల్ రేసులో వెనుకబడింది. చాలా త్వరగా పాయల్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

పాయల్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాకపోవడం కూడా ఒక కారణం. ఎందుకో టైర్ టూ హీరోలు కూడా పాయల్ ని పట్టించుకోలేదు. ఆమె నటించిన పెద్ద చిత్రాలుగా వెంకీ మామ, డిస్కో రాజా చెప్పుకోవచ్చు. వెంకీ మామ ఓ మోస్తరు విజయం సాధించినా క్రెడిట్ మెయిన్ హీరోయిన్ రాశి ఖన్నాకు పోయింది. ఇక డిస్కో రాజా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ దెబ్బతో పాయల్ కెరీర్ ప్రమాదంలో పడింది.

సీరియల్ నటి నుండి హీరోయిన్ గా ఎదిగిన పాయల్ ఇదంతా పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. ఈ మాత్రం సక్సెస్ కూడా ఎక్కువే అనుకుంటున్నారు. తృటిలో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకుందనేది మాత్రం నిజం. ఆర్ఎక్స్ 100 తర్వాత ఒక్క హిట్ మూవీ పడినా అమ్మడు రేంజ్ వేరేలా ఉంది.

ఇటీవల పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్, జిన్నా చిత్రాలు విడుదలయ్యాయి. అవి కూడా ఆమెకు నిరాశే మిగిల్చాయి. ప్రస్తుతం మాయా పేటిక టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. సెల్ ఫోన్ వలన కలిగే దుష్ప్రభావాల కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. మరో వైపు ఫ్యాన్స్ కోసం హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా డెనిమ్ షార్ట్ లో పాయల్ క్రేజీ ఫోజులు ఇవ్వగా, వైరల్ అవుతున్నాయి.