
Rohit Sharma: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ పరాజయం అంచున నిలిచింది. గత రెండు టెస్టుల్లో ఏ స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించి ఆస్ట్రేలియాను మట్టి కరిపించిందో.. ఇప్పుడు అదే అస్త్రాన్ని ఉపయోగించి భారత్ బ్యాటర్లను ఆసీస్ విలవిలలాడించింది.. ఇండోర్ మైదానంపై ఎవరూ ఊహించని విధంగా బంతి టర్న్ అవుతుండడంతో తొలిరోజే భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.. వాస్తవానికి ఈ మైదానంపై మొదట బ్యాటింగ్ ఎంచుకోకూడదని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఇదే నిర్ణయం తీసుకోవడంతో ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది.. మరోవైపు సూపర్ ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా స్పిన్నర్ లయన్ తన గింగిరాలు తిరిగే బంతులతో భారత బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు.. మొదటి, రెండు ఇన్నింగ్స్ లను కలిపి అతని ఏకంగా 11 కు పైచిలుకు వికెట్లను నేలకూల్చాడు. ఒకవేళ గనుక రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ఉండకపోతే ఇండియాకు ఈ కష్టాలు ఉండేవి కావు.. మొదటిరోజు మైదానంపై ప్రేమ ఉంది కాబట్టి బంతి అనూహ్యంగా మలుపులు తిరిగింది. ఇలాంటి అప్పుడు భారత బౌలర్లు తొలిరోజు ఆస్ట్రేలియా జట్టును వెంటనే ఆల్ అవుట్ చేసేవారు. దీనివల్ల భారత జట్టుకు లాభం చేకూరేది.
తొలిరోజు బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 109 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక రెండవ రోజు రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్లు అదే వైఫల్యాన్ని కొనసాగించారు.. మొదటి ఇన్నింగ్స్ లో తప్పుల నుంచి ఎటువంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు.. పూజార ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో మ్యాచ్ మూడో రోజుకు దారి తీసింది. లేకుంటే ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలయ్యేది.. అతను కూడా మొదటి ఇన్నింగ్స్ మాదిరి ఆడి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది.
అశ్విన్ ను కాదని..
రెండవ రోజు తొలి సెషన్లో బౌలింగ్లో సత్తా చాటిన టీమిండియా.. బ్యాటింగ్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. గింగిరాలు తిరుగుతున్న మైదానంపై భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. దీనికి తోడు కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు భారత జట్టు కొంపముంచాయి. ఇక రెండో రోజు ఆట ప్రారంభంలో రవిచంద్రన్ అశ్విన్ కు రోహిత్ శర్మ ఆలస్యంగా బౌలింగ్ ఇచ్చి గోరా తప్పిదం చేశాడు. తొలిరోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా పై పూర్తి నమ్మకం ఉంచాడు.. ఇదే సమయంలో అశ్విన్ ను పట్టించుకోలేదు.. సిరాజ్, జడేజా, అక్షర్ పటేల్ తో మాత్రమే బౌలింగ్ చేయించాడు. ఈ టోర్నీ లో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ మెరుగైన ప్రతిభ చూపాడు.. నాగపూర్ టెస్టులో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. అయితే అటువంటి బౌలర్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఇవ్వలేదు. ఇక డ్రింక్స్ బ్రేక్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అశ్విన్ కు బౌలింగ్ ఇచ్చాడు. అయితే కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చేయకుండా అశ్విన్ ఒక వికెట్ తీసి జట్టులో ఆనందాన్ని నింపాడు.

అయితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 11 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆస్ట్రేలియా 30 పరుగులు అదనంగా చేసింది. ఒకవేళ అశ్విన్ కే ముందు బౌలింగ్ ఇచ్చుంటే ఆస్ట్రేలియా 160 పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యేది.. ఇక రెండు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా మొదటి ఇన్నింగ్స్ లాగే తడబాటు ప్రదర్శించింది.. లయన్ దాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రోహిత్ శర్మ మళ్ళీ తప్పులు చేశాడు. ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో అద్భుత బ్యాటింగ్ తో విలువైన పరుగులు చేసిన అక్షర్ పటేల్ ను ప్రమోట్ చేయకుండా ఈ ఎనిమిదవ స్థానంలో పంపాడు. దీనికి టీం మేనేజ్మెంట్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. అతడిని భరత్ స్థానంలో పంపించి ఉంటే ఒంటరి పోరాటం చేస్తున్న పూజలకు అండగా నిలిచేవాడు.. తక్కువలో తక్కువ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా టీమిండియా మెరుగైన స్థితిలో ఉండేది. కానీ అక్షర్ పటేల్ ను ఎనిమిదవ స్థానంలో పంపడం, మరో ఎండ్ లో బ్యాటర్లు మొత్తం అవుట్ కావడంతో అక్షర్ పటేల్ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లోను అతను నాట్ అవుట్ గా నిలిచాడు. నాగ్ పూర్, ఢిల్లీ టెస్టుల్లో అక్షర్ ఆడిన కీలక ఇన్నింగ్స్ లతోనే ఇండియా విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో అతను నిస్సహాయంగా ఉండి పోవడంతో ఓటమి అంచున నిలిచింది.
ఇక బ్యాటర్లు మొత్తం విఫలమవుతున్న వేళ పుజారా తనదైన శైలిలో నిదానంగా ఆడుతూ ఉంటే తన అనవసరమైన స్ట్రాటజీతో రోహిత్ గెలికాడు.. దాటిగా ఆడాలని ఇషాన్ తో సందేశం పంపించాడు.. అటాకింగ్ గేమ్ ఆడాలని రోహిత్ చెప్పడంతో అప్పటిదాకా నిదానంగా ఆడిన పూజార తన శైలికి భిన్నంగా భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత లయన్ బౌలింగ్లో స్మిత్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు.. పూజారను తన శైలిలో రోహిత్ ఆడనిస్తే ఇండియాకు 100 పరుగుల ఆధిక్యం లభించేది.. ఫలితంగా ఆస్ట్రేలియాను శాసించే స్థాయిలో ఉండేది.. కానీ రోహిత్ తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల ఇప్పుడు ఓటమి అంచున నిలిచింది. అద్భుతం జరిగితే తప్ప ఇండియా గెలిచే పరిస్థితులు లేవు.
Rohit Sharma shamelessly Smiling after not taking a Review!! If Virat was captain he would have been trolled 100 times #INDvsAUSTest | #RohithSharma pic.twitter.com/jDuOKCSMtw
— Verot Choli (@VerotCholi) March 1, 2023