Bigg Boss 6 Telugu- Rohit: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ గతం లో ఎన్నడూ కూడా జరగని కొన్ని ఊహించని పరిణామాల నడుమ ఎలిమినేషన్స్ జరిగాయి..స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేటైనా ప్రతీసారి సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారేమో అని అనుకున్నారు ప్రేక్షకులు..కానీ గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా సీక్రెట్ రూమ్ మరియు వైల్డ్ కార్డు ఎంట్రీ లేదు..గత వారం ఇనాయ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లగా..ఆరు మంది కంటెస్టెంట్స్ మిగిలారు.

ఈ ఆరు మందిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకి పంపించబోతున్నామని నాగార్జున మొన్న ఆదివారం రోజే తెలిపాడు..బుధవారం అనగా ఈరోజు ఆ ఎలిమినేషన్ జరగబోతుంది..ఆదివారం అర్థ రాత్రి నుండి నేటి వరుకు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు..శ్రీహాన్ మరియు రేవంత్ టాప్ 2 కంటెస్టెంట్స్ గా అత్యధిక ఓట్లతో కొనసాగుతున్నారు..వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు..మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే.
సోషల్ మీడియా లో వచ్చిన అనధికారిక ఓటింగ్ ప్రకారం శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వాలి..ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే ఆమెకి 50 శాతం కంటే ఎక్కువగా తక్కువ ఓట్లు వచ్చాయి..కానీ అధికారిక ఓటింగ్ లో మాత్రం శ్రీ సత్య కంటే రోహిత్ కి తక్కువ వచ్చాయట..ప్రస్తుతం ఆయన డేంజర్ జోన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..కానీ సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం రోహిత్ టాప్ 3 లో ఉన్నాడు..మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది తెలియాలంటే ఈరోజు ప్రసారం అవ్వబొయ్యే ఎపిసోడ్ వరకు వేచిచూడాలి..వీళ్ళిద్దరిని కాకుండా ఆది రెడ్డి ని తొలగించిన ఆశ్చర్యపోనక్కర్లేదు..ఈ సీజన్ లో ఇలాంటి ట్విస్టులు చాలానే చూసాము..ఏదైనా జరగొచ్చు.

ఆఖరి నిమిషం వరుకు వేచి చూడలిసిన పరిస్థితి ఈ సీజన్ లోనే ఏర్పడింది..ఇనాయ ని ఎలిమినేట్ చేసి తక్కువ ఓట్లు రప్పించుకున్న శ్రీ సత్య ని సేఫ్ చేసినప్పుడే ఈ షో అర్థం ఎలా వెళ్తుందో అయ్యుండాలి..ఆమెని బిగ్ బాస్ టీం కావాలనే సేఫ్ చేస్తూ వస్తుందని..కాబట్టి ఆమె టాప్ 5 లోకి వెళ్లడం పక్కా అని నెటిజెన్స్ అంటున్నారు..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.