Allu Arjun Arrested : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కాసేపటి క్రితమే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యినట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసు లో నిజానిజాలు రుజువు అయితే అల్లు అర్జున్ కి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని, ఆయన కెరీర్ సర్వనాశనం అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసారు. మా అభిమాన హీరోని ఏమి చెయ్యబోతున్నారు అంటూ ఆరోపించారు. ఏ తప్పు చేయకుండా ఒక మనిషిపై పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఇంత కక్షగట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రీమియర్ షోస్ కి, మొదటి రోజు కి థియేటర్స్ వద్దకు అభిమానులు భారీగా సమీకరణం అయ్యే అవకాశాలు ఉన్నందున పోలీసు భద్రతని కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ రాసిందని, కానీ పోలీసులు భద్రతా ఇవ్వలేకపోయారని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో ఆధారాలతో సహా బయటపెట్టారు.
ఇదంతా పక్కన పెడితే ఈ కేసు వేసిన రేవతి భర్త భాస్కర్ మీడియా తో మాట్లాడుతూ, అల్లు అర్జున్ పై నేను వేసిన కేసు ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఆయన అరెస్ట్ అవుతాడని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేసాడు. కేసు లో వచ్చిన ఈ కీలక ట్విస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ కి గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆయన్ని నాంపల్లి హై కోర్టు కి తీసుకెళ్లారు. దారిపొడుగునా పోలీసులు కోర్టు వీధుల్ని మోహరించారు. జన సమీకరణ జరగకుండా, ఎలాంటి అశాంతి వాతావరణం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు.
తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదు
అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు…
అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటా – రేవతి భర్తVideo Credits – TV5 https://t.co/4xGlURl07U pic.twitter.com/N9orEXNmIq
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024