Pushpa Movie: పుష్ప నిర్మాతల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండగానే…ఈ మాజీ పోలీస్ అధికారి హాట్ కామెంట్స్

Pushpa Movie: సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎంతటి సూపర్ హిట్టో చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరీస్ లో “పుష్ప దీ రూల్” పేరుతో రెండో పార్ట్ త్వరలో రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.. విడుదలై 15 రోజులైనప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్ లో సాగుతోంది.. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటితో దాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. భారీ […]

Written By: Rocky, Updated On : April 22, 2023 8:17 am
Follow us on

Pushpa Movie

Pushpa Movie: సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎంతటి సూపర్ హిట్టో చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరీస్ లో “పుష్ప దీ రూల్” పేరుతో రెండో పార్ట్ త్వరలో రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.. విడుదలై 15 రోజులైనప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్ లో సాగుతోంది.. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటితో దాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టరనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇది జరుగుతుండగానే పుష్ప సినిమాకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది.. ఈసారి విశ్రాంత పోలీస్ ఐజి కాంతారావు పుష్ప దర్శకుడు సుకుమార్ మీద విరుచుకుపడ్డారు. పార్ట్ వన్ లో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్లు కుమ్మక్కైనట్టు చూపించారని, ఇది సరైన విధానం కాదని కాంతారావు అన్నారు. చిత్తూరులోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్ల బారిన పడకుండా కాపాడుతున్నది పోలీసులే అనే విషయాన్ని సుకుమార్ గుర్తుంచుకోవాలన్నారు. పుష్ప కథ బాగుందని, కథనం మాత్రమే ఇబ్బంది కలిగించిందని కాంతారావు తెలిపారు.. టాస్క్ ఫోర్స్ శేషాచలం కొండలను కాపాడేందుకు ఎంత కృషి చేస్తోందో సుకుమార్ తెలుసుకుంటే బాగుంటుందని కాంతారావు చురకలు అంటించారు.

Pushpa Movie

విశ్రాంత పోలీస్ అధికారి కాంతారావు మాట్లాడిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు పుష్ప నిర్మాతల కార్యాలయాల్లో గత మూడు రోజులుగా సోదాలు జరుగుతుండడం, ఈ లోగానే కాంతారావు ఏకంగా పుష్ప దర్శకుడు సుకుమార్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి కాంతారావు చంద్రబాబు హయాంలో శేషాచలం టాస్క్ ఫోర్స్ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఈయన హయాంలో ఎంతోమంది తమిళ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిపై పిడి యాక్ట్ కేసు పెట్టారు. వేల టన్నుల కొద్ది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బహిరంగ మార్కెట్లో వేలం వేయగా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.

అయితే తాము ఎర్రచందనం పరిరక్షణ కోసం ఇంత కృషి చేస్తుంటే సుకుమార్ పోలీసులు ఎర్రచందనం దొంగలతో లాలూచీపడ్డారని సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ అని కాంతారావు ప్రశ్నిస్తున్నారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ మరీ ఇంత దారుణంగా తీయాల్సిన అవసరం లేదని కాంతారావు నొక్కి చెబుతున్నారు. గతంలో పుష్ప సినిమా మీద గరికపాటి హాట్ కామెంట్లు చేశారు.. ఇది సినిమాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు కాంతారావు చేసిన కామెంట్లు కూడా రెండవ పార్ట్ కు హెల్ప్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ మీద ఐటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో పుష్ప భవిష్యత్తు ఏమిటి అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.