
Sasha Chhetri: దూరాలను దగ్గరకు చేర్చిన మొబైల్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారింది. మొబైల్ ఉండగానే సరిపోదు.. అందులో సిమ్ కార్డు తప్పనిసరి.. మనిషికి మెదడు ఎంత ఇంపార్టెంటో.. సెల్ లో సిమ్ కార్డు కూడా అంతే ప్రాధాన్యంగా చెప్పుకుంటారు. సిమ్ కార్డ్స్ రక రకాల కంపెనీలో ఉత్పత్తి చేసినా ఇప్పుడు ఎయిర్ టెయిల్, జియో అత్యంత ఎక్కువ స్థాయిలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. జియో మార్కెట్లోకి రాకముందు ఎయిర్ టెయిల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. అలా కొనడానికి అడ్వర్టయిజ్మెంట్లే కారణం. ఎయిర్ టెయిల్ 4జీ మార్కెట్లోకి తీసుకొచ్చిన సందర్భంలో ఓ అమ్మాయి ఫేమస్ అయింది. బేబీ కటింగ్ తో ఉన్న ఈమె ఆకర్షణీయంగా ఉండడంతో 4జీ గురించి జనాల్లోకి తొందరగా వెళ్లింది. ప్రస్తుతం ఇమె ఎక్కుడంది? ఏం చేస్తుంది? అనే ఆసక్తి చర్చ సాగుతోంది.
దేశంలో ఏ మూలన ఎయిర్ టెల్ బోర్డు కనిపించినా 4జీ మొబైల్ లో ఈ అమ్మాయి ఫొటో కనిపిస్తుంది. దీంతో ఈమె బాగా పాపులర్ అయింది. అందమైన చిరునవ్వుతో ఉండే ఈమె పేరు సాషా చెత్రి. ఎయిర్ టెల్ తరువాత కొన్ని ప్రముఖ అడ్వర్టయిజ్మెంట్లతో తో పాటు కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఈమె ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆమె ఏం చేస్తున్నారనని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు.
2015లో ఎయిర్ టెల్ యాడ్ ద్వారా ఫేమస్ అయిన సాషా ఆ తరువాత ‘కత్తిబట్టి’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు సినిమాల్లో కనిపించింది. అయితే అడ్డర్టయజ్మెంట్ల ద్వారా పాపులారిటీ తెచ్చుుకున్న సాషా.. సినిమాల్లో మాత్రం స్టార్ కాలేకపోయారు. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో గుర్తింపు రాలేకపోయింది. అయినా ఇండస్ట్రీలో రాణించాలని తెగ ట్రై చేసింది. దీంతో సోషల్ మీడియాలో తన లేటేస్ట్ ఫొటోస్ పెట్టి ఆకర్షించింది.

సోషల్ మీడియాలోను ఈమధ్య పోస్టులు చేయడం మానేసింది సాషా. ఉన్నట్టుండి ఒక్కసారిగా కనిపించకుండా పోయేసరికి ఆమెకు పెళ్లయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరికొందరుమాత్రం అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీపై విరక్తి చెంది ఆన్లైన్లో కనిపించడం లేదంటే పోస్టులు పెడుతున్నారు. కానీ ఆమె మళ్లీ సినిమాల్లోకి , అడ్వర్టయిజ్మెంట్లలో కనిపించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.