https://oktelugu.com/

Trivikram Srinivas Affair : మొన్న పూజ హెగ్డే..నేడు సంయుక్త మీనన్.. త్రివిక్రమ్ ఎఫైర్ బయటపెట్టిన హీరోయిన్

Trivikram Srinivas Affair : ఆన్ స్క్రీన్ మీద అతనొక మాటల మాంత్రికుడు..కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఒక రొమాంటిక్ హీరో..అతను మరెవరో కాదు, మన త్రివిక్రమ్ శ్రీనివాస్.గతం లో ఈయన పై సోషల్ మీడియా లో ఎన్నో రూమర్స్ వచ్చాయి.చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడంటూ ప్రచారాలు కూడా జరిగాయి.అయితే ఈ రూమర్స్ లో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ, మనోడి తీరు , నడవడిక చూస్తూ ఉంటే అతని మీద వచ్చిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 26, 2023 / 01:14 PM IST
    Follow us on

    Trivikram Srinivas Affair : ఆన్ స్క్రీన్ మీద అతనొక మాటల మాంత్రికుడు..కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఒక రొమాంటిక్ హీరో..అతను మరెవరో కాదు, మన త్రివిక్రమ్ శ్రీనివాస్.గతం లో ఈయన పై సోషల్ మీడియా లో ఎన్నో రూమర్స్ వచ్చాయి.చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడంటూ ప్రచారాలు కూడా జరిగాయి.అయితే ఈ రూమర్స్ లో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ, మనోడి తీరు , నడవడిక చూస్తూ ఉంటే అతని మీద వచ్చిన రూమర్స్ మొత్తం నిజమేనేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది.ఈమధ్య కాలం లో పూజ హెగ్డే తో వరుస పెట్టి సినిమాలు చెయ్యడం వల్ల వీళిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడుస్తుంది అంటూ రూమర్స్ వచ్చాయి.ఆమెతో ఇదివరకు ఆయన అరవింద సమేత,అలా వైకుంఠపురం లో మరియు రీసెంట్ గా చేస్తున్న మహేష్ మూవీ లో కూడా ఆమెనే హీరోయిన్ గా నటిస్తుంది.

    మొన్నీమధ్యనే ఆమెకి ఒక విలువైన కారును కూడా బహుమతిగా ఇచ్చినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..ఇ ది ఇలా ఉండగా పూజ హెగ్డే తో పాటుగా మలయాళం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ తో కూడా మనోడు సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నట్టు టాక్.భీమ్లా నాయక్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హీరోయిన్ , ఆ తర్వాత భింబిసారా మరియు సార్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.వీటిల్లో భింబిసారా సినిమా మినహా, మిగిలిన రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ రైటర్ గాను , మరో సినిమాకి సహా నిర్మాతగానూ వ్యవహరించాడు.ఈ రెండు సినిమాల్లో ఆమెకి అవకాశం రావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే అని సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది.రీసెంట్ గా ‘సార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సంయుక్త మీనన్ కి ‘ఐ లవ్ యూ’ చెప్పి సంచలనం రేపాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

    ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా దామిని విల్లా సినిమా లో హీరోయిన్ గా నటించిన రేఖా భోజ్ త్రివిక్రమ్ మరియు సంయుక్త మీనన్ మధ్య ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘ఎప్పుడూ ఆ మలయాళీ మీనన్ మీద మాత్రమే కాదు గురూజీ గారు, మాలాంటి వాళ్ళని కూడా పట్టించుకోండి’ అంటూ ఒక ట్వీట్ వేసింది.దానికి క్రింద నెటిజెన్స్ ఎవరు ఆమె అని అడగగా దానికి రేఖ భోజ్ సమాధానం చెప్తూ ‘ఇంకెవరు, రీసెంట్ గా మన గురూజీ చల్లని చూపుని దక్కించుకున్న సంయుక్త మీనన్’ అంటూ రిప్లై ఇస్తుంది.ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.దీనిపై త్రివిక్రమ్ టీం స్పందిస్తుందో లేదో చూడాలి.