
RC 15 Movie Title: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఏడాది నుండి ఎదురు చూస్తున్న #RC15 కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. షూటింగ్ ప్రారంభమై ఇన్ని రోజులు అయినా కూడా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో చరణ్ ఫ్యాన్స్ కోపం తో మూవీ టీం ని బండ బూతులు తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అసలు వారిలో #RRR సినిమాతో తమ అభిమాన హీరో కి గ్లోబల్ వైడ్ క్రేజ్ వచ్చింది అనే ఆనందం కంటే #RC15 అప్డేట్ రాలేదనే కోపమే ఎక్కువ ఉండేది. అయితే ఇన్ని రోజుల వారి ఎదురు చూపులకు నేడు తెరపడనుంది.అయితే ఇన్ని రోజులు ఈ మూవీ టైటిల్ సోషల్ మీడియా లో CEO అని ప్రచారం అయ్యింది.

ఈ టైటిల్ తో పాటుగా ‘సేనాని’ , ‘సర్కారోడు’ వంటి టైటిల్స్ కూడా ప్రచారం అయ్యాయి. కానీ అవేమి కాకుండా ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ ‘గేమ్ చేంజర్’ అని ఫిక్స్ చేసినట్టు సమాచారం. అన్ని భాషల్లోకి కామన్ టైటిల్ గా ఇదే పెట్టబోతున్నారట. దీనికంటే CEO టైటిల్ ఇంకా క్రేజీ గా ఉందని, ఈ గేమ్ చేంజర్ అనే టైటిల్ సోషల్ మీడియా వాడే నెటిజెన్స్ కి బాగా నచ్చినా, మాస్ లోకి వెళ్లడం చాలా కష్టం అని విశ్లేషకుల అభిప్రాయం.#RRR టైటిల్ లాగానే CEO టైటిల్ పెట్టి ఉంటే అద్భుతంగా ఉండేదని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలిమరి ఫ్యాన్స్ భయపడుతున్నట్టుగా ఈ సినిమా టైటిల్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందా లేదా అనేది.