https://oktelugu.com/

Ravanasura: రవితేజ ‘రావణాసుర’ ప్రీ ఇంటర్వెల్ సన్నివేశానికి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Ravanasura: వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న రవితేజ నుండి రాబోతున్న మరో చిత్రం ‘రావణాసుర’.రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.టీజర్ మరియు ట్రైలర్ కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే విడుదల చేసిన పాటలలో ఒక పాట బాగా క్లిక్ అయ్యింది. దీనితో ఈ మూవీ పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.దానికి తగ్గట్టుగానే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 6, 2023 / 01:36 PM IST
    Follow us on

    Ravanasura

    Ravanasura: వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న రవితేజ నుండి రాబోతున్న మరో చిత్రం ‘రావణాసుర’.రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.టీజర్ మరియు ట్రైలర్ కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే విడుదల చేసిన పాటలలో ఒక పాట బాగా క్లిక్ అయ్యింది.

    దీనితో ఈ మూవీ పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతున్నారు.అది ఆడియన్స్ ని మరింత థ్రిల్ కి గురి చేస్తున్నాయి.ఈ సినిమా లో వచ్చే ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుందట.రీసెంట్ గా వచ్చిన సినిమాలలో ఇలాంటి ట్విస్ట్ ని ఇదివరకు ఎప్పుడూ చూసి ఉండమని అంటున్నారు.

    అంతే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపొయ్యెలా చేస్తుందట, అంత భారీ ట్విస్ట్స్ ఏమి అయ్యుంటుందో తెలియాలంటే మరికొద్దీ గంటలు వేచి చూడాల్సిందే.అయితే ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సభ్యులు A సర్టిఫికెట్ ని జారీ చేసారు.అందుకు కారణం ఈ సినిమాలో మితిమీరిన వయోలెన్స్ మరియు కొన్ని అసభ్య పదజాలం ఉండడమే.

    Ravanasura

    అవన్నీ తొలగించాల్సిందిగా వాళ్ళు కోరారు, కానీ అవన్నీ తొలగిస్తే సుమారుగా 20 నిమిషాల సినిమా ఎడిటింగ్ లో పోతుంది.ఆ 20 నిమిషాలే సినిమాకి ప్రధానమైన హైలైట్ అట.అందుకే డైరెక్టర్ ఒప్పుకోలేదని, దానివల్ల సెన్సార్ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ని ఇచ్చిందని అంటున్నారు.మరి ఈ నెగటివ్ మార్క్ ని దాటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించి రవితేజ కి హ్యాట్రిక్ హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.