Dhamaka Collections: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ధమాకా చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..సోషల్ మీడియా లో కాస్త డివైడ్ టాక్ ఉన్నప్పటికీ బయట మాత్రం ఈ సినిమాపై పబ్లిక్ లో మంచి పాజిటివ్ టాక్ నడుస్తుంది..క్రాక్ తర్వాత రవితేజ కి మరో సూపర్ హిట్ అని..కలెక్షన్స్ పరంగా ‘పైసా వసూల్’ చిత్రమని..ఆయన ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ వేసిన సినిమా అనే టాక్ నడుస్తుంది..రవితేజ ని ఒక కమర్షియల్ సినిమాలో మంచిగా ప్రెజెంట్ చేస్తే చాలు, కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తాయి అని చెప్పడానికి నిదర్శనం గా నిలిచింది ధమాకా మూవీ ఓపెనింగ్స్..ఒక్క ఓవర్సీస్ మినహా..మిగిలిన అన్ని ప్రాంతాలలో దంచికొట్టిన ఈ సినిమా వసూళ్లు మొదటి రోజు ఎక్కడ దాకా వచ్చిందో ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజం 2.10 కోట్లు
సీడెడ్ 0.72 కోట్లు
ఉత్తరాంధ్ర 0.56 కోట్లు
ఈస్ట్ 0.24 కోట్లు
వెస్ట్ 0.26 కోట్లు
నెల్లూరు 0.13 కోట్లు
గుంటూరు 0.40 కోట్లు
కృష్ణ 0.24 కోట్లు
మొత్తం 4.66 కోట్లు
ఓవర్సీస్ 0.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.45 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 5.26 కోట్లు
వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ కి ధమాకా ఓపెనింగ్ నంబర్స్ చాలా అద్భుతంగా వచ్చినట్టే..కానీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రం రీసెంట్ గా విడుదలైన అడవి శేష్ ‘హిట్ 2 ‘ కంటే తక్కువ వసూళ్లే వచ్చాయని చెప్పొచ్చు..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో హిట్ 2 కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి కానీ,ఓవర్సీస్ లో మాత్రం ‘ధమాకా’ హిట్ 2 చిత్రం వసూళ్లకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.

అక్కడ ఈ సినిమాకి కేవలం 15 లక్షల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..’హిట్ 2′ కి ఓవర్సీస్ లో దాదాపుగా 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక్కడే పెద్ద తేడా జరిగింది..హిట్ 2 మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు 6 కోట్ల 50 లక్షల రూపాయిలు కాగా, ‘ధమాకా’ చిత్రానికి 5 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.