https://oktelugu.com/

‘రావణాసుర’ క్లోసింగ్ కలెక్షన్స్..రవితేజ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్

Ravanasura collections : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’.టాలీవుడ్ లో ఏ హీరో కూడా చెయ్యని రిస్క్, సినిమా మొత్తం పూర్తి స్థాయి నెగటివ్ రోల్ తో అదరగొట్టేసాడు రవితేజ.మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి,అలా మొదటి మూడు రోజులు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చాయి, కానీ వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. హీరో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2023 / 07:59 PM IST
    Follow us on

    Ravanasura collections : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’.టాలీవుడ్ లో ఏ హీరో కూడా చెయ్యని రిస్క్, సినిమా మొత్తం పూర్తి స్థాయి నెగటివ్ రోల్ తో అదరగొట్టేసాడు రవితేజ.మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి,అలా మొదటి మూడు రోజులు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చాయి, కానీ వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.

    హీరో క్యారక్టర్ పూర్తి స్థాయి నెగటివ్ రోల్ అవ్వడం, దానికి తోడు A సర్టిఫికేట్ రావడం ఈ చిత్రానికి పెద్ద మైనస్ పాయింట్స్ అయ్యాయి.ఫలితంగా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది.పబ్లిసిటీ ఖర్చులు మరియు ప్రింటు ఖర్చులను కూడా లెక్క వేస్తె 24 కోట్ల రూపాయిలు అయ్యిందన్నమాట.

    8 రోజుల తర్వాత ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా షేర్ వసూళ్లు రావడం ఆగిపోయింది.ఫలితంగా 12 కోట్ల రూపాయిల క్లోసింగ్ కలెక్షన్స్ వచ్చాయి.అంటే బయ్యర్స్ కి 12 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట.ఇది రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

    ‘ధమాకా’ , ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టూ బ్యాక్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన రవితేజకి ఇంతపెద్ద డిజాస్టర్ ఫ్లాప్ తగలడం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి.సినిమా బాగున్నప్పటికీ నెగటివ్ క్యారక్టర్ చేయడమే పెద్ద పొరపాటు అయిపోయింది.రవితేజ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడతారు.ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఎన్నో ఉంటాయి.అందువల్ల వాళ్ళు ఈ చిత్రం థియేటర్స్ వైపు కూడా చూడలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.