Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందాన హాట్ ట్రెండీ వేర్ ధరించి సెగలు పుట్టించారు. అమ్మడు కసి చూపులు గుండెను బేజారు చేసేలా ఉన్నాయి. మగ మనసులు దోచేస్తున్న రష్మిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఒక ప్రక్క సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేస్తూనే మరో ప్రక్క సోషల్ మీడియా పోస్ట్స్ తో ఫిదా చేస్తుంది. ఇక 2022లో రష్మికకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శర్వానంద్ కి జంటగా ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ప్లాప్ అయ్యింది. అయితే సీతారామం బంపర్ హిట్ కొట్టింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది.

పాకిస్థానీ అమ్మాయిగా రష్మిక తన పాత్రకు న్యాయం చేశారు. అయితే క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ కొట్టేసింది. సీతగా మృణాల్ మెస్మరైజ్ చేశారు. ఇక రష్మిక బాలీవుడ్ మొదటి చిత్రం గుడ్ బై నిరాశపరిచింది. ఈ సినిమాను పట్టించుకున్న నాథుడే లేడు. అమితాబ్ నటించినా బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించినప్పటికీ చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. ఆమె నటించిన సినిమాల ప్రోగ్రెస్ కార్డు ఇలా ఉంటే… వ్యక్తిగతంగా వివాదాలు చుట్టుముట్టాయి. రష్మిక యాటిట్యూడ్ వివాదాలకు దారి తీసింది.
కాంతార చిత్రం చూడలేదని రష్మిక పొగరుగా సమాధానం చెప్పడం కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసింది. కన్నడ అమ్మాయి అయ్యుండి, ఇంతేనా స్పందించేదని పరిశ్రమ మండిపడింది. ఆమెను బ్యాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదానికి రష్మిక ఫుల్ స్టాప్ పెట్టారు. కాంతార మూవీ చూసి యూనిట్ సభ్యులు బెస్ట్ విషెస్ తెలియజేశాను. మొదటిసారి అడిగినప్పటికి నేను సినిమా చూడలేదు. కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేయాలనుకోవడంలో నిజం లేదంటూ వివరణ ఇచ్చింది. రష్మిక సంజాయిషీ అనంతరం కన్నడ పరిశ్రమ వర్గాలు కొంచెం మెత్తబడ్డాయి.

2022 ఆమెకు పూర్తి స్థాయిలో కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో కొండంత ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. కాగా ఏడాది ప్రారంభం అవుతూనే రష్మిక బడా ప్రాజెక్ట్ తో వస్తుంది. ఆమె హీరోయిన్ గా నటించిన వారసుడు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 12న లేదా 14న వారసుడు విడుదల కానుంది. అధికారికంగా డేట్ ఇంకా ప్రకటించలేదు. అలాగే ఆమె సెకండ్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను జనవరి 20న నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదల కానుంది. పుష్ప 2, యానిమల్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 2023లో అవి విడుదల కాకపోవచ్చు.