
Rashmika Mandanna Assets: ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో రష్మిక మందాన ఒకరు. ఈమెది మామూలు లక్ కాదు. చాలా తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగారు. వరుస హిట్స్ ఆమెను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ చేశాయి. సౌత్ టు నార్త్ టాప్ హీరోల పక్కన దున్నేస్తుంది ఈ భామ. సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకునే రష్మిక… బ్రాండ్ ప్రమోషన్స్, మోడలింగ్ ద్వారా మరికొంత ఆర్జిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఆరేడు ఏళ్ళలో ఆమె బాగానే సంపాదించారనే టాక్ ఉంది. ఈ క్రమంలో రష్మికకు ఐదు ప్రదేశాల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయంటూ ఒకరు పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ కి రష్మిక స్పందించారు.
”కేవలం 5 ఏళ్ల కెరీర్లో రష్మిక ఐదు ప్రదేశాల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ కొన్నారు. హైదరాబాద్, గోవా, కూర్గ్, బెంగుళూరు, ముంబై నగరాల్లో ఆమెకు ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి’ అంటూ ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీనికి సమాధానంగా… ”ఇదంతా నిజమైతే బాగుండు” అని రిప్లై ఇచ్చింది. ఆమె పరోక్షంగా ఖండించారని అర్థం అవుతుంది. మీరు చెప్పినట్లు నాకు ఆ ఆస్తులు ఉంటే బాగుండేదన్న భావంలో రష్మిక కామెంట్ చేశారు. స్టార్ లేడీగా రష్మిక బాగానే సంపాదిస్తున్నారన్నది నిజం.
#Rashmika owns 5 luxurious apartments in 5 places🤨#RashmikaMandanna 🔥 pic.twitter.com/9zHBwvPU37
— Nerdy News (@NerdyNews07) February 10, 2023
ఆమె వద్ద వందల కోట్ల ఆస్తులు ఉన్నాయన్న వాదన కూడా ఉంది. ఒకటి రెండు సార్లు కర్ణాటకలోని తన నివాసం, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ మధ్య కాలంలో ఐటీ దాడులు ఎదుర్కొన్న ఏకైన హీరోయిన్ రష్మిక మందాన. కాగా తమది చాలా పూర్ ఫ్యామిలీ అని రష్మిక చెప్పడం విశేషం. కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావట. దీంతో నెలకు రెండు నెలలకు ఇల్లు మారాల్సి వచ్చేదట. అద్దె ఇల్లు వెతుకుతూ రోడ్ల మీద తిరిగిన రోజులు ఉన్నాయని రష్మిక ఒక సందర్భంలో చెప్పారు.

ఇక రష్మిక వద్ద ఎంత ఆస్తి ఉంది అనేది ఆ దేవుడికే తెలియాలి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రష్మిక వారసుడు విడుదల చేశారు. విజయ్ హీరోగా నటించిన తమిళ వర్షన్ వారిసు రూ. 300 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో అల్లు అర్జున్ కి జంటగా నటిస్తున్నారు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా ఉన్నారు.