
Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ అనుచిత కామెంట్స్ చేశారు. ఆమె క్యారెక్టర్ దెబ్బతీసేలా పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ పై ఫైర్ అయిన రష్మీ చర్యలకు సిద్ధంగా కాగా ఆ వ్యక్తి ప్రాధేయపడ్డాడు. ఈ మధ్య సెలెబ్రిటీలు ట్రెండ్ మార్చారు. ఒకప్పుడు సోషల్ మీడియా వేధింపులకు స్పందించేవారు కాదు. ఎంత ట్రోల్ చేసినా లైట్ తీసుకునేవారు. రష్మీ గౌతమ్ కూడా ప్రతి రోజూ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొంటుంటారు. హైదరాబాద్ లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనలో రష్మీని పలువురు టార్గెట్ చేశారు. యానిమల్ లవర్ గా ఉన్న రష్మీ వీధి కుక్కలకు మద్దతుగా పలుమార్లు మాట్లాడింది. ఆమె కామెంట్స్ గుర్తు చేస్తూ పిల్లాడి మరణానికి నీలాంటి వాళ్లే కారణమంటూ టార్గెట్ చేశారు.
తాజాగా ఓ నెటిజన్ రష్మీని ఉద్దేశిస్తూ ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. నటుడు ఆదితో రష్మీ వైల్డ్ రొమాన్స్ చేస్తుంది. సుడిగాలి సుధీర్ కేవలం టీఆర్పీ కోసమే. ఆది-రష్మీ రొమాన్స్ చూసి ఇంద్రజ మేడమ్ షాక్ అయ్యింది… అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశాడు. సదరు కామెంట్ కి రష్మీ గౌతమ్ ని ట్యాగ్ చేశాడు. దీంతో ‘చాలా కాలంగా ఇలాంటి వాళ్ళను భరిస్తూ వస్తున్నాను. ఒకపై సహించేది లేదు. నాపై అనుచిత కామెంట్ చేయడమే కాకుండా నన్ను ట్యాగ్ చేశావంటే నీకు ఎంత ధైర్యం.. దీనికి నువ్వు అనుభవిస్తావని…’ హెచ్చరిస్తూ రష్మీ కామెంట్ పోస్ట్ చేశారు.

రష్మీ దెబ్బకు భయపడిన సదరు నెటిజెన్ కాళ్ళ బేరానికి వచ్చాడు. నన్ను క్షమించండి మేడం ఇకపై ఎప్పుడూ చేయనంటూ బ్రతిమిలాడుకున్నాడు. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తాని రష్మీ చెప్పడంతో నాకు ఫ్యామిలీ ఉంది. నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేస్తాను ఈసారికి మన్నించండి అంటూ వేడుకున్నాడు. అతడి ఇంస్టాగ్రామ్ చాట్ రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతన్ని ఏం చేయాలో మీరే చెప్పండి అంటూ నెటిజెన్స్ ని అడిగింది.

దీనికి సంబంధించిన రష్మీ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేధింపులపై రియాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఈసారి ఆమె ఫైర్ అయ్యారు. ఇక రష్మీ అతన్ని వదిలేస్తుందో? లేక సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటుందో? చూడాలి. ఇటీవల హైద్రాబాదు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. సెలబ్రిటీల మీద సోషల్ మీడియా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రకటన విడుదల చేశారు.