Ranveer Deepik Quadruplex : బాలీవుడ్ లోనే టాప్ హీరో, హీరోయిన్ జంట రణ్ వీర్ సింగ్-దీపికా పడుకొణే.. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక కూడా తమ సినీ ప్రయాణాన్ని ఆపడం లేదు. దీపిక అయితే మరింత హాట్ గా సినిమాల్లో నటిస్తోంది. రణ్ వీర్ సైతం కొన్ని టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే భారీ రెమ్యూనరేషన్ (పారితోషికం) తీసుకునే హీరోల్లో రణ్ వీర్ సింగ్ ఒకరు. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్ రణ్ వీర్. ఇక తమ సంపాదనను అంతా ఖరీదైన వ్యవహారాలపైనే పెడుతుంటారు.

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ సైతం ఇప్పుడు తనకు వచ్చే భారీ పారితోషికాన్ని లగ్జరీల కోసమే ఖర్చు చేశాడు. ఈ హీరో మరో అత్యంత ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. సముద్రం ఒడ్డున, బీచ్ అందాలు కనిపించేలా ఓ లగ్జరీ క్వాడ్రూప్లెక్స్ ను (నాలుగు ఫ్లోర్లు ఉన్న ఇల్లు) భారీ ధరకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇల్లు ధర చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలోని బ్యాండ్ స్టాండ్ లో సాగర్ రెషమ్ టవర్ లో రూ.119 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడని సమాచారం అందింది. ఈ క్వాడ్రూప్లెక్స్ మొత్తం 16,17,18,19 ఫ్లోర్లకు విస్తరించి ఉంది. ఈ అపార్ట్ మెంట్ నుంచి సముద్రం, బీచ్ అందాలను అస్వాదించవచ్చు. అందుకే ఇంత ధర పెట్టి ఈ ఖరీదైన ప్రాంతంలో రణ్ వీర్ కొనుగోలు చేశాడు.
ఈ ప్రాపర్టీలో ఏకంగా 19 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలంతోపాటు విశాఖలమైన టెర్రస్ కూడా ఉంది. ఈ ఇంటిని రణ్ వీర్, ఆయన తండ్రి జగ్ జీత్ సింగ్ డైరెక్టర్లుగా ఉన్న ఓ ఫైవ్ మీడియా వర్క్స్ ద్వారా కొనుగోలు చేశారు. దీని కోసం ఏకంగా రూ.7.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
ఇక ఈ ఖరీదైన అపార్ట్ మెంట్ పక్కన .. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్లకు దగ్గరగానే ఉంటుంది. కాగా ముంబైలోని బాంద్రా, జుహు ప్రాంతాల్లోనే చాలా మంది బాలీవుడ్ స్టార్లు, బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇప్పుడు రణ్ వీర్ సింగ్-దీపిక జంట కూడా ఇక్కడ సెటిల్ అయినట్టైంది.