https://oktelugu.com/

Rana Naidu Review : ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఫుల్ రివ్యూ..బూతుల పురాణం తో నిండిపోయిన షో!

నటీనటులు : విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి, ఆశిష్ విద్యార్ధి, సర్వీన్ చావ్లా, సుచిత్ర పిళ్ళై, అభిషేక్ బనెర్జీ తదితరులు. బ్యానర్ : నెట్ ఫ్లిక్స్ డైరెక్టర్ : సుపార్న్ వర్మ, కరణ్ అన్షుమ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ : సంగీత్ – సిద్దార్థ్ Rana Naidu Review :  మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేందుకు ఎల్లపుడూ ఆసక్తి చూపే విక్టరీ వెంకటేష్ ఇన్ని రోజులు తన అబ్బాయి రానా దగ్గుపాటి తో కలిసి ఒక పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2023 / 08:59 PM IST
    Follow us on

    నటీనటులు : విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి, ఆశిష్ విద్యార్ధి, సర్వీన్ చావ్లా, సుచిత్ర పిళ్ళై, అభిషేక్ బనెర్జీ తదితరులు.

    బ్యానర్ : నెట్ ఫ్లిక్స్
    డైరెక్టర్ : సుపార్న్ వర్మ, కరణ్ అన్షుమ్యాన్
    మ్యూజిక్ డైరెక్టర్ : సంగీత్ – సిద్దార్థ్

    Rana Naidu Review :  మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేందుకు ఎల్లపుడూ ఆసక్తి చూపే విక్టరీ వెంకటేష్ ఇన్ని రోజులు తన అబ్బాయి రానా దగ్గుపాటి తో కలిసి ఒక పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యలేదని అసంతృప్తి దగ్గుపాటి అభిమానుల్లో మొదటి నుండి ఉండేది.అయితే మొత్తానికి వాళ్ళ ఎదురు చూపులకు ఒక వెబ్ సిరీస్ ద్వారా తెరపడుతుందని మాత్రం ఊహించలేకపోయారు.నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ఇద్దరు క్రేజీ హీరోలను పెట్టి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది.చాలా కాలం క్రితమే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ మొత్తానికి ఈమధ్యనే విడుదలకు నోచుకుంది.టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసిన ఈ వెబ్ సిరీస్,అభిమానులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

    కథ :

    బాలీవుడ్ సినీ సెలెబ్రెటీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం లో రానా నాయుడు (దగ్గుపాటి రానా) దిట్ట.ఎంత పెద్ద సమస్య అయినా ఒక్కసారి తన వద్దకి కేసు వచ్చిందంటే పరిష్కరించే వరకు నిద్రపోడు.ఇక ఎలాంటి సమస్యకి కి అయినా నిమిషాల్లో పరిష్కార మార్గం చూపే వ్యక్తి రానా నాయుడు తండ్రి నాగనాయుడు(వెంకటేష్).కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా గతం లో నాగనాయుడు ని రానా నాయుడు జైలుపాలు చేస్తాడు.ఇది ఒక ట్విస్ట్ లాగ రివీల్ అవుతుంది.జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత నాగనాయుడు రామానాయుడికి పెద్ద తలనొప్పిగా మారుతాడు.అసలు రానా నాయుడు నాగనాయుడుని జైలుకి ఎందుకు పంపిస్తాడు?,అసలు రానా నాయుడు – నాగానాయుడు మధ్య గొడవలు ఎందుకు ఉన్నాయి.అందరితో ఎంతో మంచిగా ఉండే రానా నాయుడు తన తండ్రి పట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు, ఇలాంటివి తెలియాలంటే రానా నాయుడు చూడాల్సిందే.

    విశ్లేషణ:

    హాలీవుడ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన టెలివిజన్ సిరీస్ ‘రే డోంట్ వాంట్’ కి రీమేక్ గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది.మొదటి రెండు ఎపిసోడ్స్ లో స్టోరీ అర్థం కాదు కానీ కనెక్ట్ అయ్యి చూస్తే మాత్రం రాబొయ్యే ఎపిసోడ్స్ చాలా ఉత్కంఠగా, ఆసక్తికరంగా సాగిపోతుంది.ఎప్పటిలాగానే ఇందులో విక్టరీ వెంకటేష్ తన అద్భుతమైన నటనతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు.కానీ విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా చూసేస్తారు.కానీ ఈ సిరీస్ కి మాత్రం వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఎందుకంటే ఇందులో వెంకటేష్ వాడినని బూతులు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో కూడా వాడిఉండదు.అంత A రేటెడ్ కంటెంట్ అన్నమాట.

    ఇక రానా దగ్గుపాటి కూడా ఈ సిరీస్ లో ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే కూడా బాగా నటించాడు.మిగిలిన తారాగణం కూడా సపోర్టుగా బాగానే నిలిచినప్పటికీ , కథ మొత్తం కేవలం వెంకటేష్ మరియు రానా మధ్య జరగడం తో మిగిలినవాళ్ళు పెద్దగా హైలైట్ అవ్వరు..వీళ్లిద్దరి మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు ఆడియన్స్ లో ఉత్కంఠ ని రేపుతాది.అయితే తెలుగు నేటివిటీ కి బాగా దూరంగా అనిపించేట్టు డైరెక్టర్స్ సుప్రేన్ వర్మ మరియు కరణ్ అన్షుమ్యాన్ తీశారు.అదొక్కటే ఈ సిరీస్ కి మైనస్ అని చెప్పొచ్చు.కాస్త మనం కనెక్షన్ కోల్పోయిన ఎదో హాలీవుడ్ దబ్ సినిమాని చూస్తున్న అనుభూతి కలుగుతాది.

    చివరి మాట :

    ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ కి దూరంగా ఉండండి, కానీ యూత్ మరియు మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ వెబ్ సిరీస్ ఒక విజువల్ ట్రీట్ గా ఉంటుంది.

    రేటింగ్ : 2.75/5